టొరంటో... కెనడా దేశంలోని పెద్ద నగరం. నగర జనాభా సుమారు 29 లక్షలు. నగర విస్తీర్ణం.630.21 చ.కి.మీ. ఈ నగర వాసుల్లో ఇంచుమించు 50 శాతం పౌరులు విదేశీయులే. భిన్న జాతులు, సంస్కృతుల ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. మొత్తం 140 భాషల వరకు మాట్లాడుతారు.
నివసించటానికి అత్యుత్తమ నగరాల జాబితాలో ఈ నగరం ఉంది.
ఏటా నాలుగు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నగరంలో 8,100 రెస్టారెంట్లు ఉన్నాయి.
ఈ నగరంలో అండర్ గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి వాటిల్లో పెద్దదిగా దీనికి గిన్నిస్ రికార్డూ ఉంది. మొత్తం 1200 దుకాణాలు, రెస్టారెంట్లు ఉంటాయి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పొడవు ఏకంగా 28 కిలో మీటర్లు.
నగరం మొత్తంలో కోటి వరకు చెట్లుంటాయి. 1500 ఉద్యానవనాలుంటాయి. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. నగర విస్తీర్ణంలో దాదాపు 18 శాతం ఈ పార్కులే ఉన్నాయి.
హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ 25 శాతం ఇక్కడే జరగటం ఈ నగర ప్రత్యేకత.
ఏటా 30 వరకు సాంస్కృతిక పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి.
నగరంలోని జంతుప్రదర్శనశాల కెనడాలోనే పెద్దది. ప్రపంచంలోని పెద్ద జంతుప్రదర్శన శాలలలో ఒకటి. మొత్తం 16 వేల జంతువులుంటాయి.