header

Vasco Da Gama…వాస్కోడిగామా...

ఇతను పోర్చుగీసు నావికుడు. క్రీస్తుశకం 15వ శతాబ్దానికి చెందినవాడు. మూడు ఓడలలో జులై 8, 1497 లిస్పన్ రేవు పట్టణం నుండి బయలుదేరి యూరప్ నుండి సముద్రమార్గం ద్వారా ఆఫ్రికా ఖంఢాన్ని (గుడ్ హోప్ ఆగ్రం) చుట్టి భారతదేశానికి చేరిన మొట్టమొదటి పోర్చుగీసు నావికుడు.
1498 సం.లో భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్ (కళ్లికోట) చేరి మిరియాలు ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగించాడు. ఈ విధంగా మొదలైన పోర్చుగీస్ వారి ప్రస్థానం పోర్చుగీస్ సామ్రాజ్య విస్తరణకు దారితీసింది.
ఆఫ్రికా తీరం వెంబడి పెక్కు పోర్చుగీసు వారి స్థావరాలు ఏర్పరచాడు. గామాకు పోర్చుగీసు ప్రభుత్వం కౌంట్ ఆఫ్ విడిగ్యురా అనే బిరుదును ఇచ్చి సత్కరించింది