ఇతను క్రీస్తు పూర్వం 356 సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి మాసిడోనియా రాజైన ఫిలిప్ - 2. తండ్రి ఫిలిప్ హత్యకు గురికావటంతో తన 20వ ఏట మాసిడోనియా రాజ్యానికి ప్రభువయ్యాడు. అలగ్జాండర్ కు రాజ్యకాంక్ష ఎక్కువ. ఆ రోజులలో పర్షియా సామ్రాజ్యం అతి బలవత్తరంగా ఉండేది. యూరప్ లోని డాన్యూబ్ నది నుండి ఆఫ్గనిస్తాన్ వరకూ విస్తరించి ఉండేది. ఇటువంటి మహా సామ్రాజ్యాన్ని అలగ్జాండర్ మూడు సార్లు యుద్దం చేసి జయించాడు.
తరువాత చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ సింధూ నదిని భారతదేశంలోని దాటి పంజాబ్ లో ప్రవేశించాడు. ఇక్కడే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి దేశద్రోహిగా పేరుపొందిన తక్షశిల రాజైన అంభి ఇతనికి స్వాగతం పలికాడు.
అలగ్జాండర్ ను జీలం-చీనాబ్ నదుల మధ్య ప్రాంతంలో ఉన్న రాజ్యాన్ని ఏలుతున్న పురుషోత్తముడు అడ్డగించాడు. వీరిద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. కానీ అంతిమంగా అలగ్జాండర్ కే విజయం దక్కింది. ఈ యుద్దంలో అలగ్జాండర్ గుర్రం మరణిస్తుంది. కానీ పురుషోత్తముడి పరక్రమానికి మెచ్చి రాజ్యాన్న తిరిగి అతనికే ఇస్తాడు.
తరువాత నందుల పరిపాలనలో ఉన్న మగధ సామ్రాజ్యాన్ని జయించాలనుకుంటాడు. కానీ మగధ సైన్యబలం (2,00,00 కాల్బలం,80,000 ఆశ్వికదళం,8000 రథాలు, 6000 ఏనుగులు) గురించి విని అలగ్జాండర్ సైన్యం యుద్దం చేయడానికి భయపడి వెనుకంజ వేస్తాయి. అప్పటికే అలగ్జాండర్ సైన్యం నిరంతర యుద్దాలతో పూర్తిగా అలసిపోయి ఉంది. తిరిగి మాతృదేశానికి వెళ్లాల్సిందే అని పట్టుబడతారు.
తప్పని సరి పరిస్థితులలో అలగ్జాండర్ స్వదేశానికి తిరుగు బాట పడతాడు. కానీ మార్గ మధ్యమంలో బాబిలోనియాలో విషజ్వరానికి గురై తన 33 సంవత్సరంలో (క్రీ.పూ. 323) మరణిస్తాడు.