.
క్రీస్తుపూర్వం 51 నుండి 31 సంవత్సరం దాకా ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని పాలించిన మహారాణి క్లియోపాత్ర 300 సంవత్సరాల పాటు ఈజిప్టును పాలించిన టాలెమీ రాజవంశీయులలో చివరి వ్యక్తి. పెద్ద అందగత్తె కాకపోయినా తెలివి, చమత్కారం, రాజకీయ విజ్ఞత, ఉన్నతాశయాలు ఆమె సొత్తు.
ఆనాటి రోమన్ చక్రవర్తులను ఎంతోమందిని ఆకర్షించి లోబరుచుకుంది. క్రీ.పూర్యవ 51లో 10 సంవత్సరాల తమ్ముడు 12వ టాలెమీతో కలసి సంయుక్తంగా సింహాసనం అధిష్టించి క్రీ.పూర్వం 49 లో టాలెమీ సంరక్షకులచే పదవినుంచి తొలగించబడ్డది.
క్రీ. పూర్వం 48లో జూలియస్ సీజర్ పాంపే దండయాత్రను ముగించికుని అలగ్జాండ్రియాను దర్శించినపుడు క్లియోపాత్ర రహస్యంగా అతనిని కలుసుకుంది. సీజర్ ఈమె మోహించాడు. టాలెమీనా ఒడించి 13వ టాలెమీతో తిరిగి సంయుక్తంగా సింహాసనాన్ని ఎక్కింది. తరువాత రోమ్ నగరానికి వెళ్లి సీజర్ పట్టమహిషిగా మారి సీజర్ మరణించేదాకా ఆయనతో కాపురం చేసింది.
తిరిగి ఈజిప్ట్ కు వచ్చి తన సోదరుణ్ణి సంహరించి సీజర్ వలన తనకు కలిగిన కుమారుడు సీజేరియన్ ను 14వ టాలెమీగా ప్రకటించి అతనితో పాటు సంయుక్తంగా రాజ్యపాలన ప్రారంభించింది. క్రీస్తుపూర్వం 41 సం.లో మార్క్ ఆంటోనీని వివాహమాడింది. కానీ ఈ వివాహం మార్క్ ఆంటోనీ భార్య ఆక్టేవియన్లతో పోరాటానికి కారణంగా మారింది.
ఈమె క్రీ.పూర్వం 30 సంసవత్సరంలో పాము చేత కరిపించుకొని ఆత్మహత్య చేసుకుంది.
క్లియోపాత్ర చరిత్రను రోమన్ కవులు రేస్, వర్జిల్ తమ కధలలో వర్ణించారు. బెర్నార్డ్ షా సీజర్ అండ్ క్లియోపాత్ర అనే నాటకాన్ని కూడా వ్రాసాడు.