రష్యన్ రాజకీయ నాయకుడు. నేటి ప్రపంచ రాజకీయాలలో అత్యధిక ప్రాధాన్యం సాధించిన రాజనీతి చతురుడు. పూర్తిపేరు మిఖాయిల్ సరీవిచ్ గోర్చచేవ్.
ఇతను బ్రెజ్నేవ్ అనుచరుడు. ఇతను రష్యాలో ఒక రైతు కుటుంబంలో ఉత్తర కాల్ సన్ పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉన్న ప్రేవూల్నో లోయలో 1931 సంవత్సరంలో బార్చి 2న జన్మించాడు.
మాస్కో యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసించాడు. 1952 సంవత్సరంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. కొన్నాళ్లు కోమోయ మోల్ లో యువ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొని 1963 నాటికి పార్టీ వ్యవహారాలు చేపట్టి స్తవ్రోపోల్ కార్యదర్శి అయ్యాడు 1971 సం.లో కమ్యూనిస్ట్ కేంద్ర సంఘానికి ఎన్నుకోబడ్డాడు. 1978 సం.లో వ్యవసాయ మంత్రిత్వ శాఖను చేప్టడంతో రాజకీయ ఉన్నతి ప్రారంభమైంది.
తరువాత 49వ యేట పోలిట్ బ్యూరోలో సభ్యత్వం పొందాడు. బ్రెజ్నేవ్ మరి ఇద్దరు వృద్ధనేతలు మరణించిన తరువాత బెర్నెంస్కోకు వారసుడుగా 1985 సం.లో రష్యాకు ప్రధాని అయ్యాడు. 1988 సం.నుండి సోవియట్ కు అధ్యక్షుడు.
రష్యా రాజకీయాలను ప్రజాస్వామ్య ప్రాతిపదిక మీద నడిపించే ఉద్దేశంతో రాజ్యపాలనలో పునర్వ్యస్థీకరణ దిశగా పెరిస్ర్తోయికా, బహిరంగ రాజనీతి గ్లాస్స్ నాత్ అనే నూతన విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
ఈ రాజకీయ సంస్కరణలు రష్యా రాజకీయ ఆర్ధిక విధానాలకు క్రొత్త రూపును ఇవ్వగలవని భావిస్తున్నారు. ఇతర దేశాలతో పెట్టుకోవలసిన సంబంధాల విషయంలో కూడా కొత్త పుంతలు తొక్కి అపరచాణుక్యుడనే ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. ఇతను మంచి వక్త, అందరినీ కట్టుకునే శక్తిగల ధీమంతుడు.