header

Hochimin…..హోచిమిన్....

హోచిమిన్ వియత్నాం దేశ జాతీయ నాయకుడు. 1890 మే 19వ తీదీన నామ్ దాన్ జిల్లాలోని కిమిలీన్ న్గ ఘేతిన్వాలోజన్మించాడు. హోచిమిన్ అసలు పేరు న్గూయెన్ సిన్ కుంగ్. 1942వ సంవత్సరం నుండి ఇతనిని హోచిమిన్ గా పిలుస్తున్నారు.
ఫ్రెంచ్ విప్లవం, రూసో రచనలవలన ప్రభావితుడయ్యాడు. దేశాన్ని ఫ్రెంచ్ పరిపాలననుండి విముక్తి చేయటానికి దాదాపు మూడు దశాబ్దాలపాటు 1911 నుండి 1930 వరకు విదేశాలోనే గడిపాడు . 1941లో రహస్యంగా స్వదేశానికి తిరిగివచ్చి వియెత్మిన్ జాతీయ సంస్థను స్థాపించి స్వాతంత్ర్య పోరాటం సాగించాడు.
1945 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా కొనసాగుతూ 1954 సం.లో వియత్నామ్ ను విభజించి ఉత్తర వియత్నాం కు పూర్తి స్యాతంత్ర్యాన్ని సాధించాడానికి కారకుడయ్యాడు.
1969 వ.సంవత్సరంలో హోచ్మిన్ మరణించినప్పటికీ ఐక్య వియత్నాం కొరకు స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది. చివరకు 1975 సం.ఏప్రియల్ ఐక్య వియత్నాం ఏర్పడింది.
శాంతి కాముకుడైన హోచిమిన్ హారతదేశానికి సన్నిహిత మిత్రుడు. నిరాడంబరుడు, త్యాగశీలి హోచిమిన్.