ఇతను అమెరికా జాతిపిత. మొదటి అమెరికా అధ్యక్షుడు. 1732 వ సం. పిబ్రవరి 22వ తేదీన వర్జీనియా రాష్ట్రంలోని ఫ్రెడరిక్స బర్గ్ లో నార్త్ హేంప్ షైర్ కుటుంబంలో జన్మించాడు. పదిమంది సంతానంలో ఒకడు చిన్నతనంలోనే తండ్రి మరణించగా కష్టపడి చదువుకుని సర్వేయర్ గా మారి బ్రిటీష్ సైన్యంలో చేరి ఫ్రెంచ్ వారితో పోరాడాడు.
బ్రిటీష్ వారి పన్నుల విధానానికి నిరసనగా చెలరేగిన వివిదంలో నాయకత్వం వహించి 1781 యార్క్ టైన్ వద్ద కాన్నవాలీస్ ను లొంగదీసుకున్నాడు.
1787 సం.లో అమెరికన్ రాజ్యాంగ నిర్మాణానికి ఏర్పాటైన 13 రాష్ట్రాల ఫిలడెల్ఫియా పరిషత్ కు అధ్యక్షుడై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 1789 మార్చి 4వ తేదీన అధ్యక్షుడయాయడు.
తన కాలంలో చెలరేగిన అల్లర్లను, తిరుగుబాట్లనూ అతి నేర్పుగా అణచివేసి పరిపాలన సాగించాడు. జార్జ్ వాషింగ్ టన్ 1799 సం. డిసెంబర్ 14వ తేదీన కీర్తిశేషులయ్యారు.