header

John F. Kennedy …జాన్ ఎఫ్. కెనడి...

జాన్ ఎఫ్. కెనడీ అమెరికా దేశపు 35వ అధ్యక్షుడు. గొప్ప శాంతికాముకుడు.
హార్వర్డ్ యూనివర్శిటీ పట్టభద్రుడు. రెండవ ప్రపంచయుద్ధంలో నౌకాదళంలో చేరాడు. పసిఫిక్ రంగంలో పనిచేస్తూ ఉండగా 1943 సం.లో ఇతని టార్పెడో నౌక జపాన్ దాడికి గురవుతుంది. నౌక ముక్కలైనపుడు తనతోటి సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రశంసలందుకున్నాడు.
1946 సంవత్సరంలో రాజకీయాలలో ప్రవేశించి డెమోక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉండి 1952 సం.లో నెనెటర్ అయ్యాడు. 1960 పంవత్పరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. సోవియట్ రష్యా నాయకుడు కృశ్ఛేవ్ తో కలిసి రెండుదేశాల మధ్య సత్సంభందాలకు ప్రయత్నించాడు. క్యూబా క్షిపణి ఉద్యమాన్ని పరిష్కరించటంలో రాజనీతిజ్ఞతను చూపించి చాకచక్యంగా వ్యవహరించాడు.
నీగ్రోల పౌరహక్కుల సమస్యను పరిష్కరించడానికి ఒక వినూత్న రాజకీయ వైఖరిని రూపొందించి కాంగ్రెస్ కు సమర్పించాడు. ‘ప్రొఫైల్స్ న్ కరేజ్’ అనే ఈయన రాసిన గ్రంధం రాజకీయ పరిణితికి అద్దం పడుతుంది.
దురదృష్ట వశాత్తు 1963సం. నవంబర్ 22వ తేదీన హంతకుల తుపాకీ గుళ్లకు బలై హత్యగావించబడ్డాడు.