జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినవాడు. రోమన్ యుద్దవీరుడు. లాటిన్ భాషలో సీజర్ వ్రాసిన అంతర్యుద్ధ వ్యాఖ్యానాలు బహుళ ప్రచారం పొందాయి. చరిత్రలో ప్రపసిద్ధికెక్కిన మహావీరుడు. మహావక్త.
రోమన్ సామ్రాజ్యం క్షీణిస్తున్న కాలం – క్రీస్తుపూర్వం 61లో గాల్ పాలకుడుగా నియుక్తుడయ్యాడు. 55లో బ్రిటన్ పైకి దండయాత్ర జరిపాడు. రోమ్ లో ముఖ్యంగా పాంపే సీజర్ పట్ల వ్యతిరేకత ప్రకటించటంతో విజృంభించి పాంపేను జయించాడు.
తరువాత ఈజిప్ట్ వైపుకు వెళ్లి క్లియోపాత్రను ఈజిప్ట్ కు మహారాణిని చేసాడు. తాను రోమ్ లో నియంతగా పాలన సాగించాడు.
సీజర్ ప్రవేశపెట్టిన సంస్కరణలలో జూలియస్ పంచాగం సవరణ పేర్కొనదగినది. క్రీస్తు పూర్వం 44, మార్చి 15వ తేదీన జూలియస్ సీజర్ హత్య గావించబడ్డాడు.
సీజర్ తరువాత ఇతని మేనల్లుడు ఆక్టేవియన్ రోమన్ సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు.