ఇతను ప్రఖ్యాత తత్త్వవేత్త, సాంఘిక శాస్త్రవేత్త, మానవాళి మనసులమీద చిరస్థాయిగా ఉండే తమదంటూ ముద్రవేసిన కొద్దిమంది ప్రపంచ మేధావులలో ఒకడు. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు.
ప్రజాస్వామ్యానికి చెందిన డెమోక్రాటిక్ సోషలిజం, విప్లవాత్మక కమ్యూనిజం భావాలకు బీజసూత్రాలను తన గ్రంథం దాస్ కేపిటల్ లో పొందుపరచాడు.
సోవియట్ రష్యా, చైనా, తూర్ప యూరప్ లలోని రాజకీయ నాయకులను ఈయన రచనలు అమితంగా ప్రభావితం చేశాయి.
ఇతను బాన్, బెర్లిన్, జీవనా యూనివర్శిటీలో విద్యను అభ్యసించి 1841లో డాక్టరేట్ ను సంపాదించి పారిస్ వెళ్లాడు. అక్కడ ఫ్రెడ్రిక్ ఏంజెల్స్ తో కలసి తన విప్లవాత్మక భావాలను ప్రపకటించాడు.
నూరియన్ ష్కేజీతుంగ్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేస్తూ తన భావాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయగలిగాడు. 1864 సం.లో కార్మికసంఘం స్థాపించి శ్రామిక జనోద్ధారణకు పాటుపడ్డాడు. కమ్యూనిస్ట్ మానిఫెస్టో, దాస్ కేపిట్ ఈయన ప్రముఖ రచలు.