header

Lenin…లెనిన్.....

లెనిన్ రష్యన్ రాజనీతిజ్ఞుడు. స్వాతంత్ర్య సమర యోధుడు. బోల్షవిక్ విప్లవ నాయకుడు. ఇతని అసలు పేరు వ్లాడిమర్ ఇల్విన్ ఉలయానావ్ లెనిన్. లెనిన్ తండ్రి పాఠశాల పర్వవేక్షకుడు. విద్యావంతులైన వీరి ఇల్లు మధ్యతరగతివారికి ఇష్టాగోష్టలకు కేంద్రంగా ఉండేది.
లెనిన్ కజన్ యూనివర్శిటీలో చదువుకున్నాడు. కార్ల్ మార్క్స్ రచన దాస్ కేపిటల్ చదివి ప్రేరితుడై సాంఘిక,ఆర్థిక అసమానతలను రూపుమాపటానికి కమ్యూనిజమే శరణ్యమని నమ్మాడు.సెయింట్ పీటర్స బర్గ్ లో కార్మికలను, కర్షకులను దాస్యవిముక్తులను చేయడానికి సమ్మెలు చేయించాడు. 1893-1917 వరకు రష్యాలోనూ, జర్మనీ, స్విట్జర్లాడ్ లోనూ ఆజ్ఞాత విప్లవవీరునిగా పనిచేసాడు. ఈ సమయంలోనే సోషియల్ డెమోక్రాటిక్ పార్టీ అవతరించి 1903 నాటికి అందులో మెన్షివిక్, బోల్షవిక్ పక్షాలు ఏర్పడ్డాయి.
విప్లవ మార్గంలో నడిచిన బోల్షవిక్ పక్షానికి నాయకుడయ్యాడు. ట్రాట్ స్కీ లెనిన్ కు నమ్మినబంటు. ఇతను లెనిన్ కు సలహాలు, సహాయం చేసాడు. 1905 సం.లో జరిగిన విప్లవం ఫలించక జెనీవా పారిపోయాడు. అక్కడ గోర్కీతో పరిచయమైంది.
1913 సం.లో పీటర్స్ బర్గ్ వచ్చి ప్రావ్దా అనే పత్రికను ప్రారంభించాడు. 1917 సం. ఏప్రియల్ లో ప్రవాసంలో ఉన్న విప్లవ నాయకులందరూ రష్యాకు తిరిగి రావటంతో వారికి లెనిన్ నాయకుడై నవంబర్ విప్లవం తరువాత స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు.త్వరలోనే అరాచకాన్ని అరికట్టి 1921 సం.లో సరికొత్త ఆర్ధిక విధానాన్ని రూపొందించి అమలు చేశాడు. రష్యాలో ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక అభ్యుదయానికి బీజాలు వేసిన లెనిన్ వోల్గా నదీతీరంలోఉలయానావ్ స్క్ లో 1870 సం. ఏప్రియల్ 10న జన్మించాడు. 1924 జనవరి 2న అమరుడయ్యాడు.