header

Martin Luther King….మార్టిన్ లూధర్ కింగ్ …

ఇతను పేరుపొందిన అమెరికన్ సంఘసంస్కర్త. నీగ్రోజాతి పౌర హక్కులకోసం ఉద్యమాలు నడిపిన మహానీయుడు. గాంధీజీ అహింసా సిద్ధాంతంఇతనికి స్పూర్తి నిచ్చింది.
1929 జనవరి 15వ తేదీన జన్మించాడు. ఇతనికి తండ్రి పెట్టిన పేరు మైకేల్ లూథర్ కింగ్. ప్రొటెస్టంట్ మత విప్లవ నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ ఇతని తండ్రికి ఆదర్శప్రాయుడు. తన కుమారుడు అంతటివాడు కావాలని అతని ఆరవ ఏట మైకెల్ పేరును లూధర్ కింగ్ గా మార్చివేశాడు. తోరో వ్రాసిన ‘సివిల్ డిసో బిడియన్స్’ ను 1944 సంవత్సరంలో చదివి ప్రభావితుడైనాడు. తనలో రేకెత్తిన ఆలోచనలకూ, ఆకాంక్షలకూ కార్యరూపం ఇవ్వాలంటే చర్చ్ లో పనిచేచేయడమే సరియైన పద్దతని 199లో చదువుకు స్వస్తి పలికి మౌంటట్ గోమారి చర్చ్ లో మతాచార్య పదవిని చేపట్టాడు.
ఆ కాలంలో అమెరికా దక్షిణ రాష్ట్రాలలో వర్గ వైషమ్యాలు ఎక్కువగా ఉండేవి. తెల్లవారికి వేరేవేరే పాఠశాలలు, బస్సులు, రెస్టారెంట్ లు ఉండేవి. ఈ చెడ్డ పరిస్థితులు మారాలి అని కంకణం కట్టకున్నాడు. క్రైస్తవం న్యాయు సంయమనం నేర్పితే గాంధీతత్వం తన కార్యాచరణకు దారి చూపిందని అహింసాయుతంగా పోరాటం ప్రారంభించాడు.
ఇతని నాయకత్వంక్రింద నీగ్రోలు బస్సు ప్రయాణాలు మానివేయటంతో తెల్లవారు నిర్వహిస్తున్న బస్సు వ్యాపారాలు నష్టాలకు గురైనాయి. సుమారు 40 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.
నీగ్రోలకు ఒటింగ్ హక్కు కూడా ఇవ్వరాదని ప్రచారం చేసి వార్తా దినపత్రికకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించాడు. ఇలాంటివి ఎన్నో ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించాడు.
నీగ్రో జాతిని నిద్రావస్థనుండి లేపి విద్యావంతులను చేసి వారిలో చైతన్యం తేవడానికి గాను ఒకసంస్థను స్థాపించి నిర్వహించాడు 1863 జనవరి 1 వ తేదీన నేటినుండి బానిసలందరికీ సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రకటిస్తున్నాను అని లింకన్ అన్న వందేళ్ల తరువాత సరిగా అదేనాడు నల్లవారికి అన్ని రంగాలలోనూ సమానత్వం సంపాదించే కార్యక్రమం ప్రారంభించి ఆఫీసులలోనూ, ఆసుప్రతులలోనూ క్లబ్బులలోనూ, రెస్టారెంట్లలోనూ తెల్లవారి పక్కనే నల్లవారు కూర్చునే ఉద్యమాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు. ఇతనిని అరెస్టు చేసారు, కానీ కెనడీ జోక్యంతో విడుదల చేశారు.
సమాన హక్కుల పోరాటంలో కింగ్ చూపిన అకుంఠిత కార్యదీక్ష, పట్టుదల, ఎత్తుగడ, కార్యాచరణకు 1964 సంవత్సరంలో ఇతనికి నోబుల్ శాంతి బహుమతి దక్కింది. అప్పటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు మాత్రమే. ఈ నోబుల్ బహుమతిని అందుకుంటూ ‘‘ఏదో ఒకరోజు ప్రపంచం యుద్దానికి బదులు శాంతిని కోరుకుంటుంది. రక్తానికి బదులు ప్రేమ, సౌభ్రాతత్వం వెల్లివిరుస్తాయని నమ్మడానికి నేను సాహసిస్తున్నాను. ఆ మంచి రోజుకీ మనకూ మద్య ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ నేను అధిగమించి తీరుతాను’’ అని ఎలుగెత్తి చాటాడు.
ప్రపంచంలోని మానవులందరూ నల్లవారూ, తెల్లవారూ అనే వ్యత్యాసం లేకుండా కలసి మెలసి అరమరికలు లేకుండా బ్రతికే రోజుకోసం ఎదురు చూస్తూ ‘ఐ హేవ్ ఏ డ్రీమ్’ అని కలలు కన్నాడు. 1968 ఏప్రియల్ 4వ తేదీన ఒక దుండగుడి తుపాకీ గుండుకు బలై అమరుడయ్యాడు.