header

Max Muller…. మాక్స్ మూలర్ ...

ప్రాశ్చాత్త్య వాజ్మయ వ్యాఖ్యాత. ఉపనిషత్తులు, ఋగ్వేదం వంటి ప్రాచీన భారతీయ పవిత్ర గ్రంథాలను‘‘సీక్రెడ్ బుక్స్ ఆఫ్ ఈస్ట్’’ గా ప్రచురించి మరుగున పడిన హైందవ తత్త్వాన్ని ఆంగ్లేయులకు వివరంగా తెలియచేసినవాడు.
ప్రఖ్యాత జర్మన్ కవి విల్ హెల్మ్ మూలర్ కు ఒక్కగానొక్క కొడుకు ఫ్రెడరిక్ మాక్స్ మూలర్.
మాక్స్ మూలర్ మధ్య జర్మనీ డెసాన్ లో 1823 సం.లో జన్మించాడు. 1841లో యూనివర్శిటీలో చేరి సంస్కృత భాషను అబిమాన భాషగా తీసుకొని అధ్యయనం చేశాడు. ప్రొఫెసర్ బ్రోకన్ వద్ద చేరి నల మహారాజు చరిత్ర, శకుంతల నాటకం, ఋగ్వేదం చదివాడు. తన 20వ ఏట హితోపదేశాన్ని జర్మన్ భాషలోకి అనువదించాడు. 1843లో ఫిలాసఫీలో డాక్టరేట్ పట్టాని పొందాడు.
సాయన భాష్యంతో ఋగ్వేదాన్ని ఆరు సంపుటాలలో ప్రచురించటానికి తగిన విషయాలను సేకరించాడు. మరిన్ని విషయాల సేకరణకై ఇంగ్లాడ్ వెళ్లాడు. జార్జినీ గ్రేస్ ఫెల్ అనే ఆంగ్లేయ యువతిని వివాహమాడి 1859 సం.లో ఆంగ్ల సంస్కృతిని అలవరచుకున్నాడు.
1847 లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చేరి ఫాకల్టీ మెంబర్ గా 30 సంవత్సరాలపాటు వివిధ పదవులను నిర్వహించి 1875లో పదవీ విరమణ చేశారు. మాక్స్ మూలర్ తన జీవికాలంలో భారతదేశంను సందర్శించలేదు. అయినప్పటికీ భారతదేశాన్ని ఆధ్యాత్మిక, పారమార్ధిక గృహంగా భావించాడు.
ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అజ్ ప్రపసంగాలు, పౌరాణిక ప్రేరణలు, శబ్దాల పుట్టుక చరిత్రలు, ప్రాచీన సంస్కృత వాజ్మయ చరిత్ర మాక్స మూలర్ రచనలలో పేర్కొనదగినవి. 1900 అక్టోబర్ 28న ఆక్సఫర్టులో మాక్స్ మూలర్ అమరులయ్యారు