మానవాళి స్వాతంత్ర్య పిపాసి. దక్షిణాఫ్రికా నల్లజాతివారి అభ్యున్నతకు పాటుపడిన వ్యక్తి. తెల్లవారి జాత్యంహాకర వర్గ వైషమ్య వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నల్లజాతివారి ఆశాజ్యోతి. ఆఫ్రికాలో తెల్లవారి కఠోర విధానానికి గురై 28 సంవత్సరాలపాటు రాజకీయ ఖైదీగా కారాగార శిక్ష అనుభవించాడు.
మండేలా దక్షిణ ఆఫ్రికాలోని ఉమ్తాతా (ట్రాన్ స్కే) పట్టణ శివారులోని తెంబూ రాజకుటుంబంలో 1918 సం. జూలై 18 తేదీన పుట్టాడు. క్షైసా భాష మాట్లాడే ఈ ప్రాంతంలోని ఆదిమజాతి వారికి మార్గదర్శకుబు అయ్యాడు. యువకుడిగా ఉండగానే ఈయనలో దేశభక్తి భావాలు పెల్లుబికాయి. న్యాయశాస్త్రం చదివి 1952 సంవత్సరంలో న్యాయవాద వృత్తి మొదలు పెట్టాడు.
మహాత్మాగాంధీ సత్యాగ్రహం, అహింసాపద్దతులు ఇతనికి స్పూర్తిని కలిగించాయి. జాతివిచక్షణ, అధికారిక విధానంపై శ్వేత జాతి పాలకులు ఆఫ్రికన్లపై ప్రకటించిన ఆంక్షలు తీవ్రంగా ఉన్న రోజులవి. రాత్రి వేళ బయటక తిరగాలన్నా, పొరుగు ఊరికి ప్రయాణం చేయాలన్నా, ఉద్యోగం పొందాలన్నా నల్లజాతులవారు ఆరోజులలో అనుమతి పత్రం తీసుకోవటం తప్పనిసరి. ఇంతేకంటే ఘోరం ఈ అనుమతి పత్రాన్ని తెల్లరంగువారెవరైనా, ఆఖురుకు పిల్లలైనా ఇవ్వవచ్చు. అనుమతి పత్రం దగ్గర ఉంటే తప్ప తమ గడ్డపై తాము స్వేచ్ఛగా సంచరించడానికి ఆఫ్రికన్లు నోచుకోలేదు.
దక్షిణాఫ్రికా జనాభాలో శ్వేతజాతీయులు 15 శాతానికి మించి లేరు. అయినా మొత్తం భూ విస్తీర్ణంలో 85 శాతం పైగా భూమి తెల్లవారి ఆధీనంలో ఉంది. తెల్లవారి ఆధీనంలో ఉన్న భూములను నల్లజాతివారు కొనటానికి కూడా వీలులేదు.
తెల్లవారు ప్రయాణించే రైలు కంపార్ట్ మెంట్ లలో నల్లవారికి ప్రవేశం లేదు. ఇటువంటి దారుణ శాసనాలకు గురైన నల్లజాతి బాధితుల తరపున మండేలా అపారమైన కృషి చేశారు.
ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో ప్రధాన పాత్ర వహించి నిరసన ప్రదర్శనలు, సమ్మెలు, బంద్ లు, శాసనోల్లంఘన ఉద్యమాలు, బాయ్ కాట్లు వంటి గాంధీజీ అహింసా మార్గంలో ప్రజలను కూడగట్టుకుని శాంతియుతంగా అన్యాయాలను ఎదుర్కోవటానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. 1960 సం. మార్చి, 21వ తేదీన జరిన షార్ప్ విల్లీ ఊచకోత తరువాత మండేలా తన అహింసా పద్దతికి స్వస్తి పలికి సాయిధ పోరాటానికి పూనుకొన్నాడు. ఏ ఎన్ సి కి సాయిధ దళాధిపతియై ప్రజలకు హాని కలగకుండా పథకం ప్రకారం విధ్వంసక చర్యలు చేపట్టి స్కార్టెట్ సింపర్నల్ లాగా వేషాలు మార్చి పోలీసులను ఏమార్చి 1962 తో పట్టుబడేవరకు ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. 1964లో శిక్షపడి కారాగారంలో దీర్ఘకాలం జైలుజీవితం గడిపి 1990 పిబ్రవరి 10వ తేదీన విడుదలైనాడు.
మండేలాను నల్లజాతీ సూరీడని పిలుస్తారు. జైలునుండి విడుదలైన తరువాత ఇతని శాంతియుతవిధానాలకు 1993 సంవత్సరంలో నోబుల్ బహుమతిని కూడా పొందాడు. భారతదేశం ఇతనికి భారతదేశంలోనే అత్యున్నత పురస్కరం ఐన భారతరత్న బిరుదును ప్రధానం చేసి గౌరవించింది.
చివరకు నెల్సన్ మండేలా కృషి ఫలించి జులై 18, 1918 న దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. డిసెంబర్ 5, 2013 దాకా అధ్యక్ష పదవిలో కొనసాగాడు. 2013 డిసెంబర్ 5వ తేదీన మండేలా మరణించాడు.