header

Franklin Delano Roosevelt…

ఫ్రాంక్లిన్ డిలానో రూజ్ వెల్డ్....రూజ్ వెల్ట్ అమెరికాకు 32వ అధ్యక్షుడు. 1924 సంవత్సరంలో అమెరికా ఆర్థిక సంక్షోభానికి గురైనపుడు సరైన నాయకుడిగా 1932వ సంవత్సరంలో మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నకోబడ్డాడు. తరువాత 1936లో, 1940లోనూ, 1944 సంవత్సరంలోనూ మొత్తం నాలుగుసార్లు అమెరికా అధ్యక్షునిగా ఎన్నకోబడిన మొట్టమొదటి వ్యక్తి రూజ్ వెల్ట్.
బ్యాంక్ హాలిడే, న్యూడీల్ వంటివి సంక్షోభానికి విరుగుడుగా అనేక కొత్త ఆర్థిక పరిష్కారాలను కనిపెట్టి ప్రవేశపెట్టిన ఘనత రూజ్ వెల్ట్ దే. నిరుద్యోగులకు వెసలుబాటు కల్పించడానికి సాంఘిక భద్రతను కల్పించి పేదవారిని ఆదుకున్నాడు. పొరుగు రాజ్యాలతో సఖ్యతను నెరపి వారి విశ్వాసాన్ని చూరగొన్నాడు.
రెండవ ప్రపంచయుద్ధంలో- 1939-1945 సమయంలోఅవలంభించిన విదేశీవిధానం చారిత్రాత్మకమైనది. మిత్రపక్షాలకు చేయూతనిచ్చాడు. అదే ససమయంలో రూజ్వెల్ట్, చర్చిల్, స్టాలిన్ ప్రపంచ నాయకత్రయంగా ప్రసిద్ధిపొంది శత్రుపక్షాల ఎత్తుడగలకు ప్రతివ్యూహాలు పన్ని కడకు నాగసాకీ, హీరోషిమాలపై ఆటంబాంబు ప్రయోగంతో 1945లో యుద్దవిరమణకు దారితీశాడు. ఈ నిర్ణయం 1944 సం. పిబ్రవరిలో నాయకత్రయం యాల్టా సమావేశంలో చేసింది. అయితే బాంబు ప్రయోగం ఆగస్టు 1945లో లో జరిగింది, కానీ రూజ్ వెల్ట్, మార్చి 1945 సం.లో మరణించాడు. వాస్తవానికి అణుబాంబు పరిశోధకు 1942 నుండి దోహదం చేసింది రూజ్ వెల్టే.
న్యూయార్క్ లోని హైడ్ పార్కు రూజ్ వెల్ట్ జన్మస్థానం. హార్వార్డ్ యూనివర్శిటీలో చదివి న్యాయపట్ట భద్రుడయాయడు.
దూరపు బంధువు ఎనినార్ ను ప్రేమించి 1903లో పెళ్లిచేసుకున్నాడు.
1921 సంవత్సరంలో రూజ్ వెల్ట్ అతి చల్లని నీళ్లలో ఈతకొట్టినపుడు పోలియో కాటుకు గురై నడకను కోల్పోయాడు. ఇక చక్రాలబండియే అతని నడక. ఐనా రాజకీయ జీవితానికి ఇతని అవిటితననం అడ్డురాలేదు. 1928 సం.లో న్యూయార్క్ గవర్నర్ గా ఎన్నుకోబడ్డాడు. తరువాత 1932లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి 12 సంవత్సరాలపాటు ఏకధాటిగా పాలన సాగించి అందరి ప్రశంసలు అందుకొన్నాడు.