header

Europa Park, Germany…యూరోప్ పార్క్....జర్మనీ...

Europa Park, Germany…యూరోప్ పార్క్....జర్మనీ... Europa Park, Germany…యూరోప్ పార్క్....జర్మనీ...
ఐరోపా ఖండంలో 15 ఆకర్షణీయమైన ప్రాంతాల నమూనాలతో నిర్మించబడిన పార్కు యూరోప్ థీమ్ పార్క్. జర్మనీలోని చిన్న ఊరు రస్ట్ లో ఉంది. ఇందులో ఉన్న విశేషాలు చూడటానికి ఒకరోజు సమయం సరిపోదు. ఈ పార్క్ జర్మనీలోని ధీమ్ పార్క్ లలో రెండవ అతి పెద్ద పార్క్.
ఈ పార్క్ లో 13 రోలర్ కోస్టర్లు ఉన్నాయి. ఇందులో ఉన్న మెగా కోస్టర్స్, రెండున్నర సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటాయి. మొత్తం పదమూడు రోలర్ కోస్టర్స్ లో ఎక్కితే భయపడుతూనే ఆనందిస్తారు.
ఇందులో ఉన్న ఇపి ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణం చేస్తూ మొత్తం పార్క్ ను చుట్టిరావచ్చు. వివిధ రుచులను అందించే 20 రెస్టారెంట్లలో మనకిష్టమైనవి తినవచ్చు.
ఇటలీ గోండాలా రైడ్, గ్రీక్ గైరోస్, ఘోస్ట్ క్యాస్టిల్ వంటివాటిని చూడవచ్చు.
కొర్నేలియా డైమండ్ గోల్ఫ్ రిసార్ట్ అండ్ స్పా...టర్కీ... పర్యాటదేశంగా పేరుపొందిన చిన్న దేశమైన టర్కీలో అవార్డులు గెలుచుకున్న ఫైవ్ స్టార్ రిసార్ట్ స్పా కొర్నేలియా... చుట్టూ గోల్ఫ్ క్లబ్బులు, ఆకుపచ్చని మైదానాలు ఇక్కడి ప్రత్యేకతలు
బార్లలో మార్మైడ్ పానీయం సేవిస్తూ, సీబర్డ్ బార్ లో జాజ్ సంగీతం వింటూ ఆనందించవచ్చు. పదకొండు ప్రత్యేకమై బార్లు ఉన్నాయి.
పిల్లలను ఆడించేందుకు సిబ్బంది ప్రత్యేకంగా ఉంటారు. వయసు మళ్లినవారి చూసుకునేందుకు కూడా సిబ్బంది ఉన్నారు.
వాటర్ గేమ్స్, బాణాలు, విల్లంబులు, డాన్స్ లు, బౌలింగ్ ఆటలతో రోజులతరబడి ఆనందించవచ్చు.
మధ్యధరా సమద్రతీరంలో విహరిస్తూ నచ్చిన వంటకాలు తినవచ్చు.