header

Resort World Sentosa… Singapore..రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా.....సింగపూర్....

Resort World Sentosa… Singapore..రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా.....సింగపూర్.... Resort World Sentosa… Singapore..రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా.....సింగపూర్.... ఆసియాలోనే పేరుపొందిన పర్యాటక ప్రాంతం సింగపూర్ లోని సెంటోసా దీవి. సెంటోసా దీవిలో ఉన్న ఈ ప్రాంతం నీటి ఆధారిత ఎమ్యూజ్ మెంట్ పార్క్. అంతా నీటిలోనే నిర్మించబడినది. నీటిలో ప్రయాణిస్తుంటే మన చుట్టూ సముద్రజీవులు తిరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన నీటిలో నిర్మించబడ్డ అక్వేరియంలలో రెండవది. దాదాపు వెయ్యు రకాల సముద్ర జీవులుంటాయి. ఇంకా ఎక్కువగా సముద్రజీవులను చూడగోరేవారు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ చూడవచ్చు.
కోవ్ వాటర్ పార్క్ లో శిఖరం నుండి కిందికి దూకే సౌకర్యం ఉంది. ట్రిక్ ఐ మ్యూజియం లో తీయించుకునే ఫోటోలు చిత్రంగా వుంటాయి. చెర్రీ ఆన్ టాప్ అనేది సింగపూర్ లోని ఇన్ హౌస్ యూనివర్సల్ స్టూడియో. ఇక్కడ ఉన్న రెండు క్యాసినోలు ప్రత్యేకమైనవి.
ఇరవైనాలుగు ప్రత్యేక విహారాలు, వివిధ పాత్రల ప్రదర్శనలు అలరిస్తాయి. అన్నిరకాల రుచికరమైన ఆహారం లభిస్తుంది. సముద్రజీవుల స్పెషల్ వంటకాలు రుచిచూడవచ్చు. హోటల్ రూములలో పరుపుమీద పడుకుంటే నీటిలో తేలుతున్నట్లు ఉంటుంది.