అమెరికాలోని (ఫ్లోరిడా) ఆర్లాండోలో ఉన్న ఈ థీమ్ పార్కులో సముద్ర జీవులను చూడవచ్చు. ఈ పార్కు నీటి ఆధారిత పార్క్. సముద్ర జీవుల విన్యాసాలు చూస్తూ డాల్పిన్స్, సీ లయన్స్ కు ఆహారం పెట్టే సౌకర్యం ఉంది. ఈ సముద్రజీవులు ను గురించి వివరిస్తూ, వీటిని సంరక్షించటానికి గల కారణాలను తెలియజేస్తారు.
డాల్ఫిన్స్ మనుషుల మాటలకు స్పందిస్తూ విన్యాసాలు చేస్తాయి. వీటిని చూసేందుకు వేలసంఖ్యలో పర్యాటకులు వస్తారు. జంతుప్రదర్శనకు సంబంధించిన సినిమాలను తిలకించవచ్చు. ఫ్లోరిడా ప్రాంతంలోని అత్యంత ఎత్తైన రోలర్ కోస్టర్ ఇక్కడ ఉంది.
ఇక్కడ ఉన్న హోటల్స్ లో దిగితే హోటల్ వారే ప్రదర్శనలు చూసేందుకు ఏర్పాట్లు చేస్తారు.