header

Tivoli Gardens, Denmark…టివోలీ గార్డెన్స్ –డెన్మార్క్...

Tivoli Gardens, Denmark…టివోలీ గార్డెన్స్ –డెన్మార్క్... Tivoli Gardens, Denmark…టివోలీ గార్డెన్స్ –డెన్మార్క్...
వాల్ట్ డిస్నీ నిర్మాణానికి స్పూర్తి టివోలీ గార్డెన్స్. ఎమ్యూజ్ పార్క్ లను ఇష్టపడే జార్జి కార్స్ స్టెన్సన్ అనే వ్యక్తి 1843 సంవత్సరంలో ఈ పార్క్ ను ఆరంభించాడు, అప్పటి నుండి ఈ పార్క్ అదే స్థితిలో వీక్షకులను అలరిస్తుంది. కోపెన్ హగ్, డెన్మార్క్ లో ఈ పార్కు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద అమ్యూజ్ మెంట్ పార్కు.
టివోలీ అనేది ఆ కాలానికి చెందిన మ్యాజిక్ బ్యాలెట్, మ్యూజిక్ డ్రామా, డ్యాన్స్, సంగీత కచేరీలను నేడు కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజూ కొత్త రకపు సంగీతాన్ని వినిపిస్తారు.
రోజుకొక రకం సంగీత వినిపిస్తారు. జాజ్, రాక్ సంగీతాలు రెండురోజులు, కాలానికి తగిన వినోద కార్యక్రమాలు పిల్లలకు ఏర్పాటు చేస్తారు. వేసవి ఆటలు, వర్షాకాలపు ఆటలు ప్రత్యేకంగా ఉంటాయి.
యానిమల్ కరోసల్ డ్రైవ్ (జంతువుల ఆకారంలో ఉండే రంగుల రాట్నాలు), డెమన్ డ్రైవ్ (రంగుల రాట్నాలు) లు రెండూ భయంతో పాటు ఆనందాన్ని కలిగిస్తాయి. 175 సంవత్సరాలనుండి ఇక్కడ తయారవుతున్న నార్డిక స్టైల్ బీరును ఆస్వాదించవచ్చు. పలు రకాల వంటకాలు లభిస్తాయి. వినోదాలు, ఆర్కిటెక్చర్ వింతలు టివోలీ గార్డెన్స్ ప్రత్యేకతలు