header

Best food for Skin

చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు

క్యారెట్‌: చర్మానికి కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఎ, యాంటీఆక్సిడెంట్లు అందించడంలో ఇది ముందుంటుంది. క్యారెట్‌ అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది.
టొమాటో: దీనిలోని లైకోపీన్‌ అనే పోషకం యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీన్ని వండి తీన్నా, సూప్‌, రసం రూపంలో తీసుకున్నా.. ఆ పోషకాన్ని చర్మం గ్రహిస్తుంది. నేరుగా చర్మానికి రాసుకున్నా ఫలితం కనిపిస్తుంది.
దానిమ్మ: ఈ గింజలు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలజిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా అందుతుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఏజింగ్‌ కారకాలను కలిగి ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.
ఓట్స్‌: ఉదయంపూట ఓట్స్‌ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. నిజానికి అది చాలా మంచిది. మొటిమలూ, ఇతర చర్మ సంబంధ సమస్యలున్నప్పుడు వీటిని తీసుకోవాలి. ఇందులో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువ ఉండటమే కారణం. దీన్ని తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా ఉండదు. రసాయనాలూ, కాలుష్యం ప్రభావం కూడా చర్మంపై పడదు.
గుడ్లు: దీనిలో మాంసకృత్తులు ఎక్కువ. కొలాజిన్‌ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఇవెంతో తోడ్పడతాయి.
పెరుగు: ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే పెరుగు చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మానికి తేమనందించి.. పలు సమస్యలను దూరం చేస్తుంది.
నిమ్మ: విటమిన్‌ సి అధికంగా ఉండే నిమ్మకాయ శరీరానికి ఎంత అందితే అంత మంచిది. ఇందులో ఉండే యాంటీఏజింగ్‌ కారకాలు పీహెచ్‌ స్థాయుల్ని పెంచుతాయి. వేసవిలో రసం రూపంలో తీసుకుంటే పలు చర్మ సంబంధ సమస్యలు అదుపులోకి వస్తాయి. పొడి చర్మం ఉన్నప్పుడు మాత్రం నేరుగా చర్మానికి రాసుకోకపోవడం ఉత్తమం.