header

Green Tea / గ్రీన్ టీ

Green Tea / గ్రీన్ టీ

గ్రీన్ టీ వల్ల మానవుడి శరీరానికి దక్కే ప్రయోజనాలు అమోఘం. గ్రీన్ టీ గొప్ప యాంటీఆక్సిడెంట్, కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది. రుచికి చేదు అనే అనిపించినా.. గ్రీన్ టీతో ఇన్ని లాభాలుంటాయని నిపుణులు చెబుతారు. మరి అలాంటి గ్రీన్ టీ తాగే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ మంచి చేసేదే అయినా.. దాని విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలని చెబుతున్నారు. అవేమిటంటే...
2 లేదా 3 కప్పులు చాలు.. మంచి చేస్తుంది కదా అని చెప్పి ఎడాపెడా గ్లాసుల కొద్దీ గ్రీన్ టీ తాగొద్దు. దీంట్లో కూడా మితం ఉండాలి. రోజుకు రెండూ లేదా మూడు గ్లాస్ లు చాలు.
కొంతమందికి వేడి టీ తాగుతున్నా చల్లని పానీయాలు తాగుతున్నా పళ్లు జివ్వున లాగుతున్నాయంటే ఎనామిల్ దెబ్బతిందన్న విషయాన్ని గ్రహించాలి. దీనికోసం కొన్ని చికిత్సలు వాడుకలోకి వచ్చినా వాటివల్ల ఫలితం అంతంతమాత్రమే. కానీ గ్రీన్టీలోని ఎపిగాలోకెటెచిన్-3-గాలేట్ అనే పదార్థం, దంతాలమీద ఉండే డెంటిన్ దెబ్బతినడానికీ రంధ్రాలు ఏర్పడ్డానికీ కారణమైన బ్యాక్టీరియాతో పోరాడటం ద్వారా దంతాలను రక్షిస్తుందని చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
దాంతో వాళ్లు ఆ పదార్థాన్ని క్యాప్సూ్యల్స్గా మార్చి పాడయిన దంతాలమీద ప్రయోగించారట. ఆ క్యాప్సూ్యల్ను నోట్లో పెట్టుకోగానే అందులోనుంచి ఎపిగాలో కెటెచిన్-3 గాలేట్ అనే ఆ పదార్థం విడుదలై, దంతాలమీద బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుంటుందని ఆ పరిశోధనలో స్పష్టమైంది. దీని ప్రభావం 96 గంటలపాటు ఉంటుందనీ బ్రష్ చేసినా కూడా పోవడం లేదనీ గుర్తించారు. దీన్నిబట్టి దంతాలమీద ఎనామిల్ దెబ్బతిన్నవాళ్లకి గ్రీన్ టీ మంచి మందే అని తెలుస్తోంది.
గ్రీన్‌ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వింటున్నాం. దాంతో గ్రీన్‌ టీని మన జీవితంలో భాగం చేసుకున్నాం. అయితే గ్రీన్‌ టీ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా? అయితే ఈ వాస్తవాలు తెలుసుకోండి.
• మెటబాలిజం పెరుగుతుంది: గ్రీన్‌ టీ లో ఉండే కెఫీన్‌ వల్ల శరీర కొవ్వు కరగటంతోపాటు మెటబాలిజం కూడా పెరుగుతుంది. కప్పు గ్రీన్‌ టీలో 20 నుంచి 40 మి.గ్రా కెఫీన్‌ ఉంటుంది. అలాగే దీనిలో క్యాచెటిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెటబాలిజమ్‌ను బూస్ట్‌ చేస్తాయి.
• వ్యాయామంతో రెట్టింపు: గ్రీన్‌ టీ తాగితే కొవ్వు వేగంగా కరుగుతుంది. దీనికి వ్యాయామాన్ని కూడా జోడిస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది. అంటే గ్రీన్‌ టీ తాగుతూ వ్యాయామం చేయగలిగితే బరువు తగ్గే వేగం 15 శాతం పెరుగుతుంది. అంతేకాదు. విశ్రాంతిలో ఉన్నా కొవ్వు కరిగే వేగంలో మార్పు ఉండదు.
• తక్కువ తింటాం: గ్రీన్‌ టీ తాగటం వల్ల తక్కువ కెలోరీలను తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. అలాగే గ్రీన్‌ టీ ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల కూడా శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరకుండా ఉంటాయి