ఊదలు తినటానికి రుచిగా తియ్యగా ఉంటాయి. ఊదలతో చేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది. సులభంగా జీర్ణం అవుతుంది. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా వాడతారు.
ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు. ఊదలతో తయారు చేసిన ఆహారం శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది.
ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శారీరక శ్రమలేకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారికి ఊదలు చాలా మంచి ఆహారం.
ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహారం.
జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవులలో ఏర్పడే పుండ్లు, పెద్దప్రేవులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహారం కాపాడుతుంది