కొర్రలు తీపి వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
కొర్రలలో అధిక పీచు, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్యరంతో విటమిన్లు అధికంగా ఉంటాయి. చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం.
ఉదర సంబంధ వ్యాధులకు ఔషధపరంగా మంచి ఆహారం. మాసంకృత్తులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్రల గంజి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దలు అనుభవంతో చెబుతారు.
గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినటం మంచిది.