అరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగినందు వలన పిల్లలకు మంచి ఆహారం. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అధిక యాంటి ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి
రక్తంలో చక్కెర, కొలస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తినిస్తుంది. వీటిని ఇతర పప్పుదినులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
పుష్కలంగా ఉన్న పీచుపదార్ధం వలన బరువు తగ్గడానికి అరికలు మంచి ఆహారం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గటానికి అరికెలు మంచి ఆహారం.
వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరెకలు మంచి ఆహారం. అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు.