సామాలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.
పైత్యం ఎక్కువ కావటం వలన భోజనం తరువాత గుండెల్లో మంటగా ఉండటం, పుల్లని త్రేన్పులు రావటం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి.
సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్రకణాల వృద్ధికి, స్త్రీల రుతు సమస్యలకు మంచివి. వీటిలో ఉన్న అధిక పీచు పదార్ధం వలన మలబద్ధకం అరికట్టబడుతుంది. మైగ్రేన్ సమస్యలకు ఈ ఆహారం ఉపశమనం కలిగిస్తుంది. గుండె సమస్యలకు, ఊబకాయం, కీళ్లనొప్పులకు సామాలు మంచి ఆహారం