Badam Seed ... బాదం పప్పు
బాదం పప్పును సూపర్ నట్స్ గా చెబుతారు. తల్లిపాలలోని ప్రొటీన్స్ ఇందులో ఉంటాయి. బాదంలో ఓమేగా ఫ్యాటీ ఆమ్లాలు కోలన్ క్యాన్సర్ ను నివారిస్తాయని పిత్తాశయంలోని రాళ్ళను తొలగిస్తాయని పరిశోధనలలో తేలింది.
బాదం పప్పులలో శాచురేటెడ్ కొవ్వులు తక్కువ. రోజూ కాసిని బాదం పప్పులు తింటే బరువు తగ్గటానికి అవకాశం ఉంది. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి తద్యారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదంలో ఎక్కువగా
ఉండే ఇ-విటమిన్ శక్తవంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
వంద గ్రాముల బాదంలో...
శక్తి ........................... 576 కిలో కేలరీలు
పిండి పదార్థాలు ................ 21.69 గ్రాములు
శాచ్యు రేటెడ్ ................... 3.7 గ్రాములు
పాలీ అన్ శాచ్యురేటెడ్ ................ 2 గ్రాములు
మోనో అన్ శాచ్యురేటెడ్ ............... 30.889 గ్రాములు
విటమిన్ – .................... 26.2 మి.గ్రాములు
కాల్షియం ........................ 264 మి. గ్రాములు
ఐరన్ ....................... 3.7 మి. గ్రాములు
మెగ్నీషియం ................... 268 మి. గ్రాములు
పొటాషియం ................... 705 మి గ్రాములు