Cashew Nuts ...జీడిపప్పు
జీడిపప్పు అనగానే కొవ్వులు అని భయపడతారు. కానీ ప్రకృతి వరప్రసాదం ఇవి. విటమిన్ల మాత్రలివి. ఐరన్, జింక్ లు పుష్కలం. రక్తహీనతని తగ్గిస్తాయి. ఫుష్కలంగా ఉండే మెగ్నీషియం మతిమరపును తగ్గిస్తుంది.
ఎముకలూ చిగుళ్ళ వ్యాధులను నివారిస్తాయి. మెగ్నీషియం నాడీకణాలూ
రక్తనాళాలూ కండరాలు కుంచించుకుపోకుండా చూస్తాయి. మెగ్నీషియం లోపిస్తే బి.పీ, తలనొప్పి మైగ్రెయిన్ వంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. మోనోపాజ్ తరువాత నిద్రలేమితో బాధపడేవాళ్ళు రోజూ కాసిని జీడిపప్పు
తింటే సమస్య తగ్గుతుంది. ఇందులోని ప్రొయాంథోసైనడిన్స్ కోలన్ క్యాన్సర్ నూ నివారిస్తాయి. జీడిపప్పులో ఉండే జియాజాంధిన్ రెటీనా కండరాల్లోకి చేరి కళ్ళను హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.
శక్తి | 553 కిలో క్యాలరీలు |
పిండి పదార్ధాలు | 30.19 గ్రాములు |
కొవ్వులు | 43.85 గ్రాములు |
శాచ్యురేటెడ్ | 8 గ్రాములు |
మోనో అన్ శాచ్యురేటెడ్ | 24 గ్రాములు |
పాలీ అన్ శాచ్యురేటెడ్ | 8 గ్రాములు |
ప్రొటీన్లు | 18.22 గ్రాములు |
విటమిన్ ఇ | 24.4 మి.గ్రాములు |
కాల్షియం | 37 మి. గ్రాములు |
మెగ్నీషియం | 292 మి. గ్రాములు |
పొటాషియం | 660 మి. గ్రాములు |
విటమిన్-ఇ | 0.90 మి.గ్రాములు |