header

Flakes Seeds…అవిసె గింజలు....

Flakes Seeds…అవిసె గింజలు....
అధిక కొవ్వు సమస్యకు చక్కటి పరిష్కారంగా... అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవిసె గింజల్లో అధికంగా ఉండే.. 'ఒమెగా 3' ఫ్యాటీ యాసిడ్లు గుండె సమస్యలను రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. ఒక్క గుండె సమస్యలే కాదు... అవిసె గింజలతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా... అవిశె గింజలను వేయించి పొడుం చేసుకొని తినవచ్చు. లేదా ఎండుమిర్చితో కారం చేసుకోవచ్చు. లేదా కొద్దిగా అవిశె గింజల పొడుంను చపాతీల పిండిలో కలుపుకోవచ్చు
ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసె గింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్లు తీసివేసి గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ధైరాయిడ్ పేషంట్లలకు ధైరాయిడ్ ను అదుపు చేయటంలో సహాయపడుతుంది.
ఈ గింజలు కొలెస్ట్రాల్ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే 'అలసట' నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
అవిసె గింజల్లో పలురకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలున్నాయి. వెంట్రుకలు, చర్మ సమస్యలు కూడ దూరమవుతాయి.
అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. కీళ్ల నొప్పులు కూడా పోతాయి.
చేపలు తినడం ఇష్టం లేనివారికి అవిసె గింజలు మంచి ప్రత్యామ్నాయం.
అవిసె నూనె వాడితే ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
అవిసెల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమ్యసలు ఉండవు.
మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మోనోపాజ్ దశలోని మహిళల సమస్యలచు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు.
అవిసె గింజలను వేయించుకుని కూడా తినవచ్చు. రుచికి కూడా చాలా బాగుంటాయి.