header

Ground Nuts... వేరుశెనగ పప్పు

Ground Nuts... వేరుశెనగ పప్పు

శరీర భాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలంటే శక్తితో పాటు ప్రొటీన్స్, ఫాస్పరస్, థైమిన్, నియాసిన్ పోషకాలు కీలకం ఇవన్నీ వేరుశెనగ పప్పులో ఉంటాయి. ఎ, బి,సి, ఇ విటమిన్ లతో పాటు మొత్తం 13 రకాల విటమిన్లు, ఐరన్ కాల్షియం, జింక్, బోరాన్ వంటి 26 రకాల ఖనిజాలు వీటిల్లో ఉన్నాయి. వందగ్రాముల పల్లీలలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన నియాసిన్ 85 శాతం ఉంటుంది. పల్లీలలోని రెస్ వెరాట్రల్ అనే పాలీ ఫినాలిక్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్లని హృద్రోగాలను నరాల వ్యాధులను అల్జీమర్స్ ను, వైరల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. హిమోఫీలియా, రక్త హీనత ఉన్న రోగులకు పల్లీలు మంచి ఆహారం.
వంద గ్రాముల వేరుశెనగ పప్పు లో...
శక్తి .......................... 570 గ్రాములు
పిండిపదార్ధాలు .......................... 21 గ్రాములు
కొవ్వులు .......................... 48 గ్రాముల<
మోనో అన్ శాచురేటెడ్ .......................... 24 గ్రాములు
పాలీ అన్ శాచ్యురేటెడ్ .......................... 16 గ్రాములు
ప్రొటీన్లు .......................... 25 గ్రాములు
కాల్షియం.......................... 62 మి. గ్రాములు
ఐరన్ .......................... 2 మి. గ్రాములు
మెగ్నీషియం .......................... 184 మి. గ్రాములు
పొటాషియం .......................... 332 మి. గ్రాములు
విటమిన్ ఇ .......................... 9 మి. గ్రాములు