header

Nuts, Badam Pappu Cashew Nuts, Ground Nuts, Akrots, Pine seeds

పుచ్చ గింజలు
ఇవి పైపొర తీసి ఎండబెట్టి నిల్వ ఉంచిన పుచ్చ గింజలు మార్కెట్లో దొరకుతాయి. వీటిని రోజూ కాసిని వేయుంచుకుని తింటే రుచికరమైన స్నాక్స్‌గాను ఉపయోగ పడతాయి. వీటలో అన్‌ శాచ్యురేటెడ్‌ కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. వ్యాయామం చేసేవాళ్ళు ఇవి తింటే మంచిది. రోజూ ఓ కప్పు పుచ్చ గింజల్ని తింటే 602 క్యాలరీల లభిస్తాయి.
ఇందులోని కొవ్వులు మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి. డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. ప్రోటీన్లు కండరాల, కణజాలాల పెరుగుదలకు దోహదపడతాయి. వీటిలో పిండిపదార్థాల శాతం తక్కువ ఇనుము ఎక్కువ.
గుమ్మడి
ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నివారించటంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వీటిలో పుష్కలంగా ఉండే కెరొటోనాయిడ్లు అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఆర్ట్రరైటిస్‌, ఆస్టియో ఫ్లోరోసిస్‌ నుంచి కాపాడే ఓమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు, జింక్‌ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను స్థిరంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచే ఫైటోస్టెరాల్స్‌ కూడా వీటిలో ఎక్కువే. విటమిన్‌ ఎ, విటమిన్‌ కె ,క్యాల్షియం, ఐరన్ పుష్కంగానూ బి1, బి2, బి3 కొద్దిపాళ్ళలోనూ లభిస్తాయి.
చియా
ఎంతో చిన్నవిగా ఉండే ఈ గింజల్లో పీచు, ప్రొటీన్లు, పోషక నూనె, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్‌ షుగర్‌ను స్థిరంగా ఉంచడంతో పాటు హృద్రోగాలను, బరువును తగ్గిస్తాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లా ల శాతం ఎక్కువ. పుదీనా కుటుంబానికి చెందిన ఈ గింజల్ని అమెరికన్లు సూపర్‌ ఫుడ్‌గా చెబుతున్నారు.
జనుము (గోగు)
అన్నింటిలో కెల్లా జనుము గింజల్ని అద్భుతమైనవిగా చెప్పవచ్చు. పశుగ్రాసం కోసం, నారకోసం పెంచే ఈ మొక్కల్ని తెలుగులో గోగునార, లేదా జనపనారని కూడా అంటారు. వీటిల్లో ఓమేగా6, 3 ఫ్యాటీ ఆమ్లాల శాతం ఎక్కువ. ప్రొటీన్లు పీచుపదార్థమూ మరే గింజల్లో దొరకనంత ఎక్కువగా దొరకుతాయి. కీలకమైన 10 అమైనో ఆమ్లాలు కలగలసిన ప్రొటీన్‌ వీటి నుంచి లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఫైటో స్టెరాల్స్‌ కూడా ఎక్కువే. హృద్రోగాలు, క్యాన్సర్‌, ఆల్జీమర్స్‌, పార్కిన్‌ సన్స్‌ వంటి వ్యాధుల్ని నివారించేందుకు దొహదపడతాయి.
కుసుము
వీటినే కుసుమాలనీ అంటారు. పొద్దుతిరుగుడు గింజల్లాంటివే కుసుము. ఈ మొక్క పువ్వును నకిలీ కుంకుమ పువ్వుగానూ పుస్తారు. ఈ గింజల్లో ఫోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ ఈ చాలా ఎక్కువ వీటిల్లో ఎక్కువగా ఉండే పాలీ అన్‌ శాచురేటెడ్‌ ఆమ్లాల వలన రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గింజలన్నీ ఆరోగ్యానికి మంచివే గాని పెద్ద రుచిగా ఉండవు. దోరగా వేయించుకుని కాస్త ఉప్పూ, కారం చల్లుకుని తినవచ్చు, వేయించి దంచి రోటి పచ్చళ్ళకింద తినవచ్చు, పొడులూ, సలాడ్స్‌ చేసుకోవచ్చు
అవిసె గింజలు
అవిసె గింజలు తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని గాంధీజీ అనేవారు. బరువు తగ్గాలనుకునే వారికి వీటిని మించిన ఆహారం లేదు. వీటిలో కార్పోహైడ్రేట్లు చాలా తక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ. బి విటమిన్‌ మెగ్నీషియం, మాంగనీసు, వంటివి సమృద్ధిగా ఉంటాయి.
క్యాన్సర్‌, ఆస్తమా, మధుమేహం, ఆర్ద్రరైటిస్‌ వంటి వ్యాధుల్ని అడ్డుకుంటాయి. వీటిల్లోని పీచు పేగుల్లోని విషపదార్థాన్నింటినీ తొలగించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. అయితే వీటిని నేరుగా కన్నా పిండి రూపంలో వాడితేనే ప్రయోజనం ఎక్కువ..