header

Wheat - గోధుమలు

Wheat - గోధుమలు

గోధుమలను కూడా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడతారు. పాశ్చాత్య ప్రపంచంలో గోధుమలే ప్రధాన ఆహారం. మన దేశంలోనూ ఉత్తరాది ప్రజలు బియ్యం కంటే గోధుమలనే ఎక్కువగా వాడతారు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే గోధుమలు తక్షణ శక్తినిస్తాయి. గోధుమలతో తయారు చేసే రొట్టెలు, బ్రెడ్‌ వంటివి విరివిగా ఉపయోగిస్తారు. గోధుమల్లో ఉండే గ్లూటెన్‌ అనే ప్రొటీన్‌ వల్ల ఈ పదార్థం సరిపడని కొందరిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. శాస్త్రవేత్తలు ఈ సమస్యను గుర్తించిన తర్వాత గ్లూటెన్‌ లేని గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. ఇవి ఇప్పుడు బాగానే అందుబాటులోకి వచ్చాయి. మైదాపిండితో చేసిన బ్రెడ్ కంటే గోధుమలతో చేసిన బ్రెడ్ ఆరోగ్యం.
పోషకాలు: గోధుమల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: గోధుమలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల టైప్‌–2 డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. రుమాటిక్‌ నొప్పులను, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటాన్ని, గుండె జబ్బులను, చిన్నపిల్లల్లో వచ్చే ఉబ్బసాన్ని నివారిస్తాయి.