header

Wheat Gross Juice

గోధుమగడ్డి రసం
wheat gorss juice

అన్ని వయసులవారికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేది గోధుమగడ్డి రసం. రక్తహీనతను చాలా వేగంగా తగ్గించం రక్తాన్ని అభివృద్ధి చేసే అద్భతమైన లక్షణాలు కలది గోధుమ గడ్డితో తయారుచేసిన రసం. పోషకాల సాంద్రత గింజలలో కన్నా మొలకలలో ఎక్కువగా ఉంటుంది. కానీ మొలకలలో కన్నా కూడా గడ్డిలో చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కూరగాయల రసం కన్నా గోధుమగడ్డి రసంలో నేరుగా రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 7, 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అందుకే గోధుమగడ్డి రసాన్ని గ్రీన్ బ్లడ్ అని పిలుస్తున్నారు. గోధుమ గడ్డిని ఇంటిలో కూడా తేలికగా పెంచుకోవచ్చు. మట్టిలో కొబ్బరి పొట్టు, వర్మీకం పోస్టు, కంపోస్టు కొద్ది కొద్దిగా కలిపి టబ్ లు/ ట్రేలు / కుండీలలో మూడు అంగుళాల మందంగా పైన చెప్పబడిన మిశ్రమాన్ని సమానంగా పరచి గోధుమ గింజలు చల్లాలి. 9, 10 రోజుల తరువాత నుంచి గోథుమగడ్డి కోతకు వస్తుంది. గోధుమలను మాత్రం నేరుగా చల్లకుండా రాత్రాంతా నానబెట్టి తేమ ఆరకుండా నాటాలి. గోధుమ గడ్డికి ఎండ అసలు తగలకూడదు. చెట్లకింద నీడలో కూడా పెంచుకోవచ్చు. 5 నుండి 6 అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమ గడ్డిని సేకరించి శుభ్రపరచకుని చిన్న ముక్కలుగా కత్తిరించుకుని మిక్సీలో వేసుకొని రసం తీసి తాగాలి. పరగడున తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.