Cooking Tips….Vantinti Chitkalu…వంటింటి చిట్కాలు..............
-- కూరలలో ఉప్పు ఎక్కువైతే ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని నూనె లేకుంగా బాండీలో వేయుంచి కూరలో కలపాలి
లేదా ఉడికించి తోలు తీసిన బంగాళా దుంపల ముక్కలను కూరలో కలపాలి.
-- దోశెలు కరకరలాడుతూ రావాలంటే మినపపప్పు నాన బెట్టేటపుడు ఓ గుప్పెడు కందిపప్పు , ఒక స్పూన్ మెంతులు కూడా కలపాలి.
-- దోసెల పిండి మిక్సీలో కంటే వెట్ గ్రైండర్ లో పట్టిస్తే దెసెలు కరకరలాడుతూ వస్తాయి.
-- గ్రేవీ చిక్కగా రావాలంటే కొద్దిగా కొబ్బరి పాలు లేక గిలకొట్టిన పెరుగు కలపాలి
-- కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ సైసులను పొడిలాగా చేసి కూరలో కలపాలి
== వెడల్పాటి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మ నూనె వేసి కాయగూరలూ, పండ్లూ కడగాలి. పై రసాయనాల పొర తొలగిపోవడంతోపాటూ సూక్ష్మక్రిముల బెడదా ఉండదు.
-- మూడు చుక్కల నిమ్మనూనెలో, చెంచా టీట్రీ నూనె కలిపి ఆ మిశ్రమంతో సింకులూ, వంటగట్టూ తుడిచి చూడండి. క్రిములు పోయి.. గట్టు శుభ్రపడటమే కాదు తాజా వాసనా ఉంటుంది.
-- వంటింట్లో చెత్త డబ్బా ఉంటుంది కదా.. అందులో వాడేసిన టీపొడి లేదా రెండు టీబ్యాగుల్ని వేయండి. అది దుర్వాసను పీల్చుకుంటుంది.
-- అడుగంటిన, జిడ్డుగా ఉన్న గిన్నెల్ని తోమడం కష్టంగా ఉందా. బకెట్‌లో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా వాడేసిన టీపొడీ లేదా టీబ్యాగుల్ని వేసి ఆ పాత్రల్ని ఉంచండి. కాసేపయ్యాక వాటిని తోమడం తేలికవుతుంది
-- చేపలూ, ఉల్లిపాయా, వెల్లుల్లి.. వంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీపొడిని కొద్దిగా రాసుకుని ఐదునిమిషాలయ్యాక సబ్బుతో కడిగేస్తే.. చాలు.
-- కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్క రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి
-- నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్‌లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడిఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది.
-- ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి.
-- స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు.