శరీరంలోని అధిక కొవ్వును సహజసిద్ధంగా ఆహారపు అలవాట్లను మార్చుకొని కరిగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయాన్నే పరగడుపున (ఏమీ తినకుండా) గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా తేనెను కలుపుకొని తాగాలి. కొవ్వును కరగించే గుణాలు నిమ్మకాయలో ఉన్నాయి. కానీ వెంటనే ఫలితాన్నివ్వదు. కనీసం రెండు, మూడు నెలలు ఇలా చేయాలి.
కొవ్వును కరగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుండి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగితే ఫలితం వస్తుంది. .
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువ. ప్రతిరోజూ కొన్ని వెల్లుల్లి రేకలను తింటే ఫలితం వస్తుంద. ముఖ్యంగా పొట్టదగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. .
బాదంపప్పులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులను నానబెట్టుకుని తింటే కొవ్వు కరుగుతుంది. .
కొద్దిగా పొదీనా ఆకులనుండి రసం తీసుకుని ఆ రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి. దీనితో పొట్టదగ్గర పేరుకొని పోయిన కొవ్వు తగ్గుతుంది. .