How to get better skin…Home remedies for glowing skin..చర్మం మెరుపు కోసం సాంప్రదాయ చిట్కాలు...
నిమ్మరసం, తేనె..
నిమ్మరసంలో తెల్లబపరిచే గుణం ఉంది. దానివల్ల ముదురు రంగు తొందరగా వదులుతుంది.
తాజా నిమ్మ రసాన్ని తేనెను కలిపి చర్మంపూ రాసుకోవాలి. 30 నిమిషాలు ఆరిన తరువాత మరలా నిమ్మరసంలో కొంచెం చక్కెర కూడా కలిపి దానిని చర్మంపై సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయటం వలన మృతకణాలు చర్మంపైనుండి తొలగిపోతాయి.
పెరుగు...టమాటో....
టామాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపును ఇస్తాయి. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంది. ఇది చర్మాన్ని మొత్తగా ఉంచుతుంది.
టమాటోను తీసుకుని పై పొరను తొలగించి 2 స్పూన్ల పెరుగుతో కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనినిచర్మంపై పట్టించి 20 నిమిషాల తరువాత కడిగివేయాలి.
దోస గుజ్జు....
దోస లేదా కీరదోసలోచర్మాన్ని చల్లబరిచే లక్షణం ఉంది. దీని వలన సూర్యరశ్మి వలన ఏర్పడిన ముదురు రంగు తొలగిపోతుంది. దోసను ముక్కలు చేసి పలుచటి కాటన్ గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. ఇందులో కొంచె నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలి. ఈ రసాన్ని దూదితో చర్మంపైరాసుకోవాలి. బాగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
శనగపిండి...పసుపు...
పసుపు చర్మానికి మెరుపును ఇస్తుంది. శెనగపించి తెలుపును ఇస్తుంది. ఒక స్పూను పసుపు, ఒక కప్పు శెనగపిండిలో కలిపి తగినన్ని నీళ్లు కానీ, పాలు గానీ పోసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపైనా, శరీరంపైనా రాసుకోవాలి. భాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బంగాళా దుంప రసం...
కళ్ల చుట్టూ ఉన్న వలయాలను తొలగించటంలో బంగాళాదుంప రసం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని బ్లీచ్ చేసి తెల్లగా మార్చుతుంది. కళ్లచుట్టూ తేదా మొహంమీద గుండ్రంగా తరిగిన బంగాళాదుంప 15 నిమిషాలపాటు ముక్కలను పెట్టుకోవాలి. తరువాత ముఖాన్ని కడగాలి.
బొప్పాయి...తేనె....
బొప్పాయిలో ప్రకృతిసహజమైన ఎంజైములు ఉన్నాయి. ఈ ఎంజైములు చర్మంపై ఉన్న మురికి తొలగిస్తాయి. తేనె సహజసిద్దమైప తేమను నిలిపి ఉంచుతుంది. చర్మాన్ని సున్నితంగా, మొత్తగా ఉంచుతుంది. తేనెలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ఫ్రిరాడికల్స్ ను తొలగిస్తాయి. ఫ్రీరాడికల్స్ వలన చర్మం తొందరగా ముడతలు పడుతుంది.
బాగా పండిన 4,5 బొప్పాయి ముక్కలను తీసికుని ఒక చెంచా తేనెను కలిపి పేస్టులాగా చేసుకోవాలి. చర్మం నల్లబడ్డ చోట ఈ పేస్టు రాసి చక్కగా ఆరనివ్వాలి. 20 నుండి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
ఆలోవెరా ప్యాక్...
ఆలోవెరా చర్మాన్ని మిత్తబరచి కావాల్సిన తేమను అందిస్తుంది. ఎర్రకందిపప్పు రసం చర్మాన్ని మెరిసేటట్లు చేస్తుంది.
కొద్దిగా ఎర్రకందిపప్పను సుమారు 3 గంటలపాటు నానబెట్టి నీటిని తీసివేసి మిక్సీలో వేయాలి. దీనిలో ఒక టీస్పూన్ ఆలోవెరా జెల్ ను రెండు టీ స్పూన్ల తాజా టమాటో రసాన్ని వేసి పేస్టులా మిక్సీ వేయాలి.
ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపు ఉంచిన తరువాత నీటితో నెమ్మదిగా మసాజ్ చేస్తూ కడిగివేయాలి.
ఓట్ మీల్...మజ్జిగ.....
ఓట్ మీల్ చర్మంపై పేరుకుపోయిన నల్లదనాన్ని తొలగించటంలో, చర్మాన్ని శుభ్రచేయటంలో చక్కగా పనిచేస్తుంది. మజ్జిగలో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మొత్తబరుస్తుంది. చర్మ రంగు మెరుగుపడుతుంది. రెండు స్పూన్ల ఓట్స్ లేదా ఓట్ మీల్ ను నీళ్లలో 5 నిమిషాలపాటు నాబెట్టాలి. మూడు చెంచాల మజ్జిగను దీనికి కలిపి బాగా కలియబెట్టాలి.కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు. వీటి మిశ్రమాన్ని చేతలకు, మెడలకు పట్టించాలి. ఈ భాగాలలో గుండ్రంగా నెమ్మదిగా రుద్దాలి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. చర్మం స్వచ్ఛంగా మెరుస్తుంది.
మీగడ...స్ట్రా బెర్రీలు...
స్ట్రాబెర్రీలలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతిదంతంగా మెరిసేటట్లు చేస్తాయి. మీగడ చర్మానికి కావాల్సిన తేమను అందించి ఆరోగ్యవంతంగా చేస్తుంది.
బాగా పండిన స్ట్రాబెర్రీలను తీసుకుని గుజ్జులా చేయాలి. రెండు చెంచాల తాజా మీగడను కూడా దీనితో కలిపి ఉండలు లేకుండా చేతితో బాగా నలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ముదురు రంగు చర్మంపై ఈ పేస్ట్ ను పూసి ఇరవై నిమిషాలపాటు ఉంచాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఫైనాపిల్ గుజ్జు ...తేనె....
పైనాపిల్ గుజ్జలు బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంది. ఈ ఎంజైమ్ చర్మంపై ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడి ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. మరియు దీనిలో ఉండే ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉండి సూర్యుని ఎండవలన కమిలిన చర్మాన్ని మెరిసేటట్లు చేస్తాయి.
తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates...
for further details click contact us