Indigestion…Gas problems…అజీర్తి సమస్య, త్రేన్పులు

Colastral….Cough…cold…రక్తపోటు...దగ్గు, జలుబు, కొలస్ట్రాల్..
వారం రోజులపాటు వరుసగా తేనె, వెల్లుల్లి తీసుకుంటే పలురకాలుగా ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లిపాయలను చిదిమి చిన్న, చిన్న ముక్కలుగా చేసి వాటిమీద తేనె పోయాలి. దీనిని ఒక సీసాలో పోసి మూత బిగించి వెలుతురు తగలకుండా చీకటిలో వారం రోజుల పాటు ఉంచితే చిక్కని ద్రవం తయారవుతుంది.

దీనిని రోజూ పరగడుపున ఒక స్పూన్ తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. హానికర కొలస్ట్ర్రాల్ నియంత్రించబడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాల నుండి త్వరగా కోలుకుంటారు.

గొంతునొప్పి..మంట..దగ్గు..జలుబు టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అరస్పూన్ నల్ల మిరియాల పొడి, టీ స్పూన్ ఉప్పు గ్లాస్ గోరువెచ్చటి నీళ్లలో కలిపి నోటిలో పోసుకుని రోజుకు నాలుగైదు సార్లు పుక్కిలిస్తుంటే ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.

Headache తలనొప్పి తలనొప్పి నివారణకు ట్యాబ్ లెట్స్ కంటే...దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు రాస్తూ ఉంటే తలనొప్పి తగ్గతుంది. ముఖ్యంగా జలుబు వలన వచ్చే తలనొప్పిపై బాగా పనిచేస్తుంది.

దోమల నివారణకు ఒక చుక్క నిమ్మ నూనె, రెండు చుక్కల యూకలిప్టస్‌ నూనె తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెలో కలిపి ఒంటికి రాసుకోండి. ప్రత్యేకించి దోమల రెపల్లెంట్లు వాడాల్సిన అవసరం లేదు.

Indigestion అజీర్తి, పులితేపులు, వస్తూ ఉంటే రెండు చిటికెల దాల్చిన చెక్క పొడి, రెండు చిటికెల శొంఠి పొడి నాలుగు చిటికెల యాలకుల పొడి కలిపి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణం, తేన్పులు తగ్గుతాయి.

వాము పొడి చేసుకుని అన్నం తినేముందు వేడి అన్నంలో చెంచా వాముపొడి, అరచెంచా కరగించిన నెయ్యు కలుపుకుని తినాలి

జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొను సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కప్పు నీటిలో చెంచాపొడి వేసి సగం అయ్యేదాకా మరగించుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం కలిపి తాగాలి.

పుదీనా పచ్చడిని తరచుగా తింటుంటే తేన్పులు తగ్గతాయి.

అన్నం తిన్న తరువాత రెండు తమలపాకులు, వక్క,సున్నం, ఒక లవంగం కలిపిన తాంబూలం నెమ్మదిగా తినాలి. అజీర్తి తేన్పులు తగ్గుతాయి.



తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us