Mouth Odour….నోటి దుర్వాసనను ఎలా తగ్గించుకోవాలి...?
నోటి దుర్వాసనతో ఇబ్బంది పడటానికి అనే కారణాలు ఉంటాయి. గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి ఆ నీటిని పుక్కిలించి ఊసేయటం వలన నోరు, గొంతులోని బ్యాక్టీరియా నశిస్తుంది.
నోటి దుర్వాసనకు ప్రధాన కారణం బ్యాక్టీరియా. పుదీనా, తులసి ఆకులను చప్పరిస్తూ ఉంటే అవి సహజ మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి. దంతాలు, చిగుళ్లు శుబ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
యాపిల్, క్యారెట్ తింటుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. గ్రీన్ టీ కూడా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు వంటివి కూడా నోటిలో వేసుకుని నెమ్మదిగా నములుతుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
తప్పనిసరిగా రోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి