గోళ్లు పొడి బారినట్లున్నా, బీటలు వారినా....పోషకాలు లోపించటం వలన జరుగుతంది. ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు...
గోళ్లు నిర్జివంగా ఉండా గరకుగా ఉంటాయి కొందరికి....కెరటీన్ అనే పోషకం లోపం వలన ఇలా జరుగుతుంది. కెరటీన్ గోళ్లను మృదువుగా, ఆరోగ్యంగా, బలంగా మారుస్తుంది. కెరటోన్ మాంసాహారంలో ఎక్కవగా ఉంటుంది. మరియు శాఖాహారులకు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే సోయా బీన్స్, పాలు, పాల పదార్ధాలు తీసుకోవచ్చు.
గొళ్లు పెళుసుబారి వాటినండి పొట్టులా రాలుతుంటే...... ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్ల లోపం వలన ఇలా జరుగుతుంది. ఆహారంలో అవిసె గింజలను ఏదో రూపంలో తీసుకోవాలి. సమస్య చాలా తొందరగా అదుపులోకి వస్తుంది. అవిశెలతో కారం చేసుకుని తినవచ్చు.
ఇనుము లోపం ఉంటే గోళ్లు బలహీనంగా మారతాయి. త్వరగా విరిగిపోతాయి. దీనికి ఇనుము సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలకూర, గుడ్లు, ఖర్జూరాలు ఎక్కువగా తినాలి. వీటితోపాటు సి విటమిన్ కూడా తీసుకుంటే శరీరం ఇనుమును త్వరగా శోషించుకుంటుంది. నిమ్మజాతి (సిట్రస్) పండ్లు, టమాటో, క్యాప్సికం లాంటి వాటిలో సి విటమిన్ ఉంటుంది. శరీరంలో ఇనుము లోపం తగ్గాలంటే ఇనుము లభించే ఆహారంతో పాటు సి విటమిన్ ఉన్న ఆహారం కూడా తప్పనిసరి.