Remedies for Dental Problems…పంటి సమస్యలు
ఇంట్లో ఉండే పదార్థాలతోనే పంటి, నోటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు.
ఉసిరి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి.
ఉసిరి సహజ క్లెన్సర్లా పనిచేసి నోటి దుర్వాసననూ పొగొడుతుంది. కాబట్టి రోజూ ఓ ఉసిరిని తినండి లేదా పావు చెంచా ఉసిరిపొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.
వేపాకు వేపలో చాలా ఔషధ గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తాయి.
అంతేకాదు దంతాలకూ, చిగుళ్లకూ బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కొన్ని చుక్కల వేపరసంతో మీ పళ్లూ, చిగుళ్లపై మృదువుగా రాయాలి. కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మన తాతలు, ముత్తాతలు వేప పుల్లలతో పళ్లను తోముకునేవారు. వారి పళ్లు చనిపోయేదాకా ధృఢంగా ఉండేవి.
లవంగాలు ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్యలు పెరగకుండా నియంత్రిస్తాయి.
పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూది ఉండను ముంచి పంటినొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. బుగ్గన రెండు లవంగ మొగ్గలు పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.
వంట సోడా దీనిలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నోటిలో ఎక్కువైన ఆమ్లాలను పీల్చుకుంటాయి. దంత క్షయానికీ, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నియంత్రిస్తాయి. దాంతో నోటిలో వాటి తీవ్రత తగ్గుతుంది.
అయితే తరచూ వాడటం వల్ల పళ్ల ఎనామిల్కు హాని జరగొచ్చని మరవకూడదు. ఇలాంటి చిట్కాలు ఒకటిరెండురోజులు ప్రయత్నించి చూడొచ్చు. అప్పటికీ తగ్గకపోతే దంతవైద్యుల్ని సంప్రదించాలి.
పళ్లు జివ్వు మంటున్నాయా...?
అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో కొద్దిగా లవంగనూనె కలిపి దానిని నొప్పిపెడుతున్న పంటిపై రాయాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది. పళ్లు ధృఢంగా తయారవుతాయి.
తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates...
for further details click contact us