Room fresheners…ఇంట్లో తాజా పరిమళం కోసం...

Room fresheners…ఇంట్లో తాజా పరిమళం కోసం... గదిలో వాసన వస్తుంటే అదే పనిగా రసాయనాలున్న రూంఫ్రెషనర్‌ని వాడాల్సిన అవసరం లేదు. ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.
ఒక గాజు పాత్రలో నిమ్మ నూనెలో ముంచిన దూదిని ఉంచి దాన్ని స్నానాల గదిలో పెట్టండి. దుర్వాసన పోయి అక్కడ సువాసన వస్తుంది.

వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తాయి. కొద్దిగా వేడినీటిలో ఉప్పు కలిపి ఈ నీటిని ఈగలు ముసిరిన దగ్గర చల్లి తుడిస్తే ఈగలు పోతాయి

నేలను తుడుస్తున్నప్పుడు నీటిలో రెండు చుక్కలు నిమ్మగడ్డి నూనె వేయండి. ఈగలూ, దోమలూ వంటివి ముసరవు. చక్కని సువాసనా వస్తుంది. లేదంటే పావువంతు నీళ్లల్లో రెండు చెంచాల నిమ్మగడ్డి నూనె కలిపి మరిగించండి. చక్కని ఫలితం ఉంటుంది. దాల్చినచెక్కను పొడిగా చేసి సాంబ్రాణి పొగగా వేస్తే సరి. గదంతా పరిమళాలు వ్యాపిస్తాయి.

పుల్లటి వాసనలకి ఎంతటి దుర్వాసనైనా తొలగించే శక్తి ఉంటుంది. అందుకే రెండు నిమ్మచెక్కల్ని నీళ్లల్లో పిండి గదిలో స్ప్రే చేయండి. అలానే నారింజ తొక్కలను నీటిలో వేసి ఉడికించినా సరే! సువాసనలు గదంతా వ్యాపిస్తాయి.

ఇక తాజా పూల పరిమళాల సంగతి సరేసరి! చామంతి, మల్లెలను గదిలో వేలాడదీయండి. ఇవి చక్కటి సువాసనను మనసుకి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఓ రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో తాజా గులాబీలు ఉంచండి చక్కటి సువాసనను ఆస్వాదించండి

అద్దాలూ, కిటికీలూ, ఇతర గాజు వస్తువులపై మురికి పేరుకుని, మరకలు పడ్డాయా.. వాడేసిన టీపొడినే మళ్లీ నీళ్లల్లో వేసి.. తీసుకోవాలి. దీన్ని వాటిపై చల్లి.. మెత్తని వస్త్రంతో తుడిస్తే.. మురికీ, మరకలు పోయి.. కొత్తవాటిలా మారతాయి.చామంతి రేకల్ని దానిలో వేసి గది మధ్యలో ఉంచండి. చక్కని సువాసనలతో పాటు కంటికింపుగానూ కనిపిస్తాయి.

వెడల్పాటి గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని నాలుగైదు యాపిల్‌ ముక్కలూ, రెండు దాల్చిన చెక్క ముక్కలూ, నాలుగు లవంగాలు వేసి పొయ్యిమీద పెట్టండి. నీళ్లు కాస్త వేడయితే చాలు.. ఆ పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది.

కమలాఫలం తొక్కల్ని సేకరించండి. వాటితోపాటూ దాల్చినచెక్క ముక్కలూ, బిర్యానీ ఆకులూ కొన్ని తీసుకుని పూలదండలా తయారుచేసి గదిలో ఎక్కడయినా వేలాడదీసి చూడండి. ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో.

అరోమా కొవ్వొత్తుల్ని అలాగే వెలిగించేయొద్దు. ముందు వాటిని కాఫీ గింజలు వేసిన కప్పులో ఉంచండి. దీనివల్లా ఇల్లంతా పరిమళం సొంతమవుతుంది.



తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us