-- దుస్తులపై గ్రీజు మరకలు పడితే సోడా నీళ్లలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది.
-- నూనె మరకలు పడితే సుద్దముక్కతో రుద్దడమో, పౌడర్ చల్లడమో చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉతికి నీడపట్టున ఆరేయాలి.
-- కాఫీ మరకలు పడ్డప్పుడు బేకింగ్‌సోడా వేసిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి
-- చెమట మరకలకు నిమ్మరసం రాయొచ్చు. సగం నిమ్మచెక్కను చెమట మరకలపై రుద్ది.. కాసేపయ్యాక ఉతికేయాలి
-- ఇంకు మరకలని పాలతో రుద్ది చూడండి.
-- మేకప్ చేసుకుంటున్నప్పుడు ఫౌండేషన్లు ఒలకడం, పౌడర్లు పడటం వల్ల ఏర్పడిన మరకలని షేవింగ్ క్రీంతో రుద్ది ఉతికితే సరిపోతుంది.
-- రక్తం మరకలు పడితే... హైడ్రోజన్‌పెరాక్సైడ్ వేసి రుద్దితే మరకలు తొలగిపోతాయి.
-- కొత్త తువాళ్లను ఉతికేటపుడు సాధారణంగా రంగు పోతుంది. అలా రంగు పోకుండా ఉండాలంటే తువాళ్లను మొదటిసారి ఉతికేటపుడు బకెట్ నీళ్లలో అరకప్పు పలుకుల ఉప్పువేసి ఆ నీళ్లలో తువాళ్లను నానబెట్టాలి
-- స్కెచ్ పెన్నుల గీతలు బట్టలు మీద ఉంటే వాటిపైన నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి రుద్ది ఆ తరువాత సబ్బుతో శుభ్రం చేస్తే మరకలు పోతాయి
--బట్టలపై బడిన ఇంకు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మచెక్కతో కానీ, టూత్ పేస్ట్ తోకానీ రుద్దాలి, లేక ఇంకు మరకలమీద నీళ్లు చల్లి ఉప్పుతో రుద్ది, గోరువెచ్చటి నీళ్లతో ఉతకాలి