White hair to Black Hair….తెల్ల జుట్టును తగ్గించుకోవటానికి చిట్కాలు
కుటుంబ చరిత్ర, వీపరీతమైన ఒత్తిడి, రక్తహీనత, విటమిన్ల లోపం వంటి వాటితో చిన్న వయసులోనే జుట్టు నెరవటం మొదలవుతుంది. అలాగని తలకు రంగు వేసుకోవాలని లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టు తెల్లబడటాన్ని తగ్గించుకోవచ్చు.
కరివేపాకు, కొబ్బరినూనె కరివేపాకులోని విటమిన్ బి, జుట్టుకు నల్లదనాన్ని అందిస్తుంది. బీటా కెరోటిన్ జుట్టుని ఒత్తుగా ఉంచుతుంది. కొబ్బరినూనె సహజ కండిషనర్లా పనిచేసి పొడిబారిన జుట్టుని మృదువుగా మారుస్తుంది. కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి పొయ్యిమీద పెట్టాలి.
ఆకులు నల్లగా మారాక దింపేసి వడకట్టాలి. ఈ నూనెను పడుకునే మందు తలకు రాసుకుని మర్ధన చేసి మర్నాడు షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.
ఉసిరి, మెంతులు ఉసిరిలో విటమిన్ సి తెల్లజుట్టును రాకుండా కాపాడుతుంది. మెంతులలో విటమిన్ సితో పాటు ఇనుము పొటాషియం, అల్కాలాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు నల్లబడటాన్ని తగ్గిస్తాయి. ఐదారు ఎండు ఉసిరికాయలను, టేబుల్ స్పూను మెంతులూ, అరకప్పు కొబ్బరినూనెను తీసుకోవాలి.
మెంతులను పొడిలా చేసుకోవాలి. కొబ్బరినూనెలో ఉసిరి ముక్కలను వేసి పొయ్యిమీద పెట్టాలి. ఐదు నిమిషాల తరువాత మెంతిపిండి వేయాలి. రెండు నిమిషాల తరవాత దింపి, చల్లారనిచ్చి వడకట్టాలి. ఈ నూనెను రాత్రిళ్ళు తలకు రాసుకుని మర్థన చేసుకుని మర్నాడు కడిగేసుకుంటే మంచిది.
తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates...
for further details click contact us