అమీర్ ఖాన్ పూర్తిపేరు మొహ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్. ఇతను చలన చిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు టెలివిజన్ షోలకు వ్యాఖ్యాత కూడా. 1965 మార్చి 14వ తేదీన జన్మించాడు. ఏడు ఫిలింఫేర్ ఆవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.
ఖయామత్ సే ఖయామత్ తక్ ఇతని మొదటి సినిమా. 1969లో రాఖీ సినిమాలో నటించాడు. 1990 లో దిల్, 1994లో సర్పరోష్, 1996లో రాజా హిందూస్తానీ సినిమాలలో నటించి బాలీవుడ్ లో హీరోగా స్థిరపడ్డాడు.
1998 సం.లో భారత్-కెనడా కు చెందిన ఎర్త్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు.
2001లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ స్థాపించి మొదటి సినిమాగా లగాన్ ను నిర్మించి అందులో హీరోగా నటించాడు. ఈ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. తరువాత 4 సం.లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
2006 లో పనా, రంగ్ దే బసంతి విజయవంతమైన సినిమాలు తీసాడు.2008 లో ఘజనీ, 2009లో 3 ఇడియట్స్, 2013లో ధూమ్ 3 లలో హీరోగా నటించాడు.2014లో అమీర్ ఖాన్ నటించిన పికె అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
టుంబంతో విరామ సమయాలు గడసటానికి అండన్ లో సుమారు రూ.100- కోట్ల రూపాయలతో ఇల్లు కొన్నాడు. ఇతని దగ్గర అనేక లగ్జరీ కార్లు కుడా ఉన్నాయి.