డ్యాన్సులకు ఇతని శరీరం మెలికలు తిరిగిపోతుంది. నాట్యంలో తిరుగులేని మొనగాడు. ఇతని కళ్లు బ్లూ కలర్ లోఆకర్షణీయంగా ఉంటాయి. ఇతను హిందీనటుడు రాకేష్ రోషన్ కొడుకు. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న నటుడు. భారతీయ నటులలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు కూడా. ఇతను 1974 సం. జనవరి 10వ తేదీన ముంబాయిలో జన్మించాడు. కామర్స్ లో డిగ్రీ చేసాడు.
2000 సం. రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో మొదటి సారిగా నటించి ఉత్తమ నటనకు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.2001 లో కభీ ఖుష్ కభీ గమ్ లో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది.
2000 డిసెంబర్ 20వ తేదీన తన బాల్య మిత్రురాలు నటుడు సంజయ్ ఖాన్ కూతురు సుసన్నేను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. కానీ వీరద్దరూ 2014 సం.లో విడాకులు తీసుకున్నారు.
2012 ఇతను నటించిన అగ్నిపథ్ సినిమా సీనీరంగంలో చరిత్ర సృష్టించింది.
2006 లో వచ్చిన క్రిష్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత 2008 లో ఇతను నటించిన జోధా అక్బర్ కూడా విజయవంతమైనది. కోయీ మిల్ గయా, ధూమ్ 2 సినిమాలలో నటించాడు.