రణవీర్ సింగ్ భవనాని హిందీ సినిమాలలో నటించి మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డు పొందాడు. భారతీయ నటులలో అత్యధిక పారితోషకం అందుకునే నటుడు కూడా. ఇతను 1985 6, జులైన ముంబాయిలోని బాంద్రాలో జన్మించాడు.
బ్యాండ్ బజా బారాత్ సినిమాతో హిందీ చలన చిత్ర రంగంలో ప్రవేశించాడు. ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు.
తరువాత లేడీస్ vs రికి బహి రోమాంటిక్ కామెడీ సినిమాలో నటించాడు. 2013లో లుటేరా, గోలియోన్ కా రాసలీల, రామ్ లీల, గుండే సినిమాలలో నటించాడు. చరిత్ర ప్రధానంగా నిర్మించిన ‘పద్మావత్’, ‘బాజీరావు మస్తానీ’ సినిమాలలో నటించాడు. తరువాత సింబా, గల్లీబాయ్ సాంఘిక చిత్రాలలో నటించాడు.
ఇతను ప్రఖ్యాత హిందీ నటి ‘దీపికా పడుకొనే’ ను 2018 సం.లో వివాహమాడాడు.
సినిమాలలోనే కాకుండా ఆదిదాస్, హెడ్ అండ్ షోల్డర్స్, జాక్ అండ్ జోన్స్, ధమ్స్ అప్, మేక్ మై ట్రిప్ యాడ్ లలో కూడా నటించాడు.