ఇతను బాలీవుడ్ నటుడు, నిర్మాత మరియు టెలివిజన్ వ్యాఖ్యాత. ఇతనిని ‘బాద్షా ఆఫ్ బాలీవుడ్’ అని పిలుస్తారు.14 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న నటుడు. ఇతను 1965 నవంబర్ రెండవ తేదీన జన్మించాడు. ఇతని భార్య గౌరీ ఖాన్. వీరికి ముగ్గురు కొడుకులు.
సినిమాలో ఇతను చేసిన కృషికి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. .
1980 లో టి.వీ సిరియల్ నటుడుగా తన కేరీయర్ ప్రారంభించి 1992లో దివానా సినిమాతో బాలీవుడ్ లో ప్రవేశించాడు.. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహబ్బతే సినిమాలలో నటించి బాలీవుడ్ లో హీరోగా స్థిరపడ్డాడు. .
తరువాత దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. .
షారూక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపి న్యూ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించాయి. .
ప్రభావవంతమైన భారతీయునిగా మరియు ప్రపంచంలోని 50వ పవర్ ఫుల్ వ్యక్తిగా పేరుపొందాడు. (2008 న్యూస్ వీక్ పత్రిక). .
ఇతను తన కుటుంబంతో విరామ సమయాలు గడసటానికి అండన్ లో సుమారు రూ.100- కోట్ల రూపాయలతో ఇల్లు కొన్నాడు. ఇతని దగ్గర అనేక లగ్జరీ కార్లు కుడా ఉన్నాయి.