హీరో సుధీర్ బాబు కొడుకూ అయిన చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్ ’ సినిమాలో చిన్నప్పటి నానీగా నటించాడు. ఈ అబ్బాయి కృష్ణ మనువడు. అల్లుడుడు సుధీర్ బాబు కొడుకు ఆ సినిమా తరవాత విన్నర్ లో సాయిధరమ్ తేజ్ చిన్ననాటి పాత్రనూ పోషించాడు. అందులో గుర్రాల ముందు పరుగెత్తి రిస్కీ స్టంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
మొదట్లో గుర్రాలు మీదకొస్తాయని భయపడ్డాడట... కానీ తను ఆగిపోతే సీన్ కంటిన్యుటీ పోతుందని అలానే పరుగెత్తాడట. ఈ చిన్నారిని మెచ్చుకుంటున్నారు. అలానే చరిత్ చిట్టి తమ్ముడు దర్శన్ కి కూడా సినిమాలంటే ఇష్టం. గతేడాది వచ్చిన గూఢచారి లో చిన్నారి అడవిశేష్ గా ఎంతో అమాయకంగా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.