మహానటి చూసిన వాళ్లకి ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది. అందులో సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి పాత్రలో నటించింది గాయనీ, నటి అయిన స్మిత కూతురు శివి. ఈ సినిమా జాతీయ అవార్డులు సంపాదించింది
పెద్ద పెద్ద కళ్లతో అచ్చం తల్లిలాగానే ఉండే శివిని ఆడిషన్ చేయకుండానే ఆ పాత్రకి తీసుకున్నారట. శివి నటనతో పాటు చక్కగా పాడుతుంది కూడా. గతేడాది లో రాజమౌళి సృష్టించిన కిలికి భాషలో రాసిన ఓ పాటను పాడింది. యూట్యూబ్ లో విడుదల చేసిన ఆ పాటకి ఒక్కరోజులోనే దాదాపు ఎనభై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ పాట టిక్ టాక్ లోనూ బాగా ఫేమస్ అయింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఓటు అవగాహనకు సంబంధించి స్మిత రూపొందించిన పలు వీడియోల్లో శివి కూడా కనిపించింది. నా పేరు ఆంధ్రప్రదేశ్ నా వయసు ఐదేళ్లు అంటూ ఎంత చక్కగా డైలాగులు పలికింది.