పాతాళ భైరవి సినిమాలో అంజిగాడు పాత్రలో నటించి అదే పేరుతో తెలుగు సీనీరంగంలో స్థిరపడిన ఇతని అసలు పేరు వల్లూరి బాలకృష్ణ. సీనిమాల మీద ఆసక్తితో చదువు వంటబట్టలేదు. నాటక రంగంలో ప్రవేశించాడు. ఇతను తన మాటలతో, నటనతో, శరీర హావభావాలతో ప్రేక్షకులకు నవ్వు తెప్పించగల సమర్ధుడు.
ఇతను 1925లో జన్మించాడు. తెలుగు హాస్యనటుడు రాజబాబుకు ప్రేరణ బాలకృష్ణే. రాజబాబు కృతజ్ఞతతో బాలకృష్ణను సన్మానించాడు కూడా. ఆ రోజులలో విఠలాచార్య సినిమాలో బాలకృష్ణ(అంజిగాడు) తప్పనిసరిగా ఉండాల్సిందే.
మాయాబజార్, అగ్గివీరుడు, సువర్ణసుందరి, అగ్గి బరాటా, జ్వాలాదీప రహస్యం, పిడుగురాముడు, గులేబా కావళి కథ, బొబ్బిలి యుద్ధం, మర్మయోగి ఇంకా అనేక జానపద సినిమాలలో హాస్యనటుడిగా నటించి పేరుపొందాడు.