తెలుగు చిత్రసీమలో తిరుగులేని హాస్య నటుడిగా పేరుపొందిన కన్నెగంటి బ్రహ్మానందం1956 ఫిబ్రవరి 1 వ తేదీన గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని చాగంటివారి పాలెం గ్రామంలో జన్మించాడు. ఐదు నంది పురస్కాలు అందుకున్నాడు. భారత ప్రభుత్యం ఇతనని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.
ఇతను తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదువుకున్నాడు. అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసాడు. మొదట చిన్న చిన్న పాత్రలలో నటించినా ఇతనికి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా అహ నా పెళ్లంట. ఇక అప్పటి నుండి ఇప్పటి దాకా నటుడిగా వెనుతిరగలేదు. ప్రస్తుత కాలానికి (2020) నటిస్తూనే ఉన్నాడు